పుదీన రైస్ | Pudina Rice Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pudina Rice recipe in Telugu,పుదీన రైస్, Pravallika Srinivas
పుదీన రైస్by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పుదీన రైస్ వంటకం

పుదీన రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pudina Rice Recipe in Telugu )

  • బియ్యం : 3 గ్లాస్సెస్
  • పుదీన - 1 కట్ట
  • పచ్చిమిర్చి - 4
  • నూనె - 4 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు - 1 టేబుల్ స్పూన్
  • అల్లం - 2 అంగుళాలు
  • ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు - 10
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్

పుదీన రైస్ | How to make Pudina Rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. పుదీన కట్టని తీస్కొని ఆకులు వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టి అన్నం ని పొడి పొడి గా వండుకోవాలి. ఒక మిక్సర్ జార్ లో పుదీనా, పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
  3. చిన్న కడాయి పెట్టి పల్లీలు ,నువ్వులు, ధనియాలు, మిరియాలు వేయించి అన్ని కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. పెద్ద కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక తయారు చేసిన పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక అన్నం వేసి పైఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసిన పల్లీల పొడి వేసి కలుపుకోవాలి.
  5. అంతే వేడి వేడి పుదీనా అన్నం సిద్ధం...

నా చిట్కా:

ఇదే విధంగా కొత్తిమీర , కర్వేపాకు తులసి ఆకులు తో కూడా రైస్ చేయచ్చు . పాలకూర, తోటకూర గోంగూర అలాంటివి ఉడికించి చేసుకోవాలి.

Reviews for Pudina Rice Recipe in Telugu (0)