హోమ్ / వంటకాలు / పుదీన రైస్

Photo of Pudina Rice by Pravallika Srinivas at BetterButter
713
3
0.0(0)
0

పుదీన రైస్

Oct-11-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన రైస్ రెసిపీ గురించి

పోషకాలు పుష్కలంగా ఉన్న పుదిన ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. పుదినా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం : 3 గ్లాస్సెస్
  2. పుదీన - 1 కట్ట
  3. పచ్చిమిర్చి - 4
  4. నూనె - 4 టేబుల్ స్పూన్
  5. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  6. ఆవాలు - 1 టేబుల్ స్పూన్
  7. అల్లం - 2 అంగుళాలు
  8. ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  9. పల్లీలు - 2 టేబుల్ స్పూన్
  10. నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  11. మిరియాలు - 10
  12. ధనియాలు - 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. పుదీన కట్టని తీస్కొని ఆకులు వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టి అన్నం ని పొడి పొడి గా వండుకోవాలి. ఒక మిక్సర్ జార్ లో పుదీనా, పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
  3. చిన్న కడాయి పెట్టి పల్లీలు ,నువ్వులు, ధనియాలు, మిరియాలు వేయించి అన్ని కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. పెద్ద కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక తయారు చేసిన పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక అన్నం వేసి పైఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసిన పల్లీల పొడి వేసి కలుపుకోవాలి.
  5. అంతే వేడి వేడి పుదీనా అన్నం సిద్ధం...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర