కరివేపాకు నువ్వుల రైస్ | Curry leaves sesame rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves sesame rice  recipe in Telugu,కరివేపాకు నువ్వుల రైస్, Kavitha Perumareddy
కరివేపాకు నువ్వుల రైస్by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కరివేపాకు నువ్వుల రైస్ వంటకం

కరివేపాకు నువ్వుల రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves sesame rice Recipe in Telugu )

  • ఒక పెద్ద కప్ అన్నం
  • ఒక చిన్న కప్ కరివేపాకు.
  • పచ్చిమిర్చి 3
  • ఎండుమిర్చి 3
  • నువ్వుల పొడి 2 స్పున్
  • వేయించిన నువ్వులు 2 స్పూన్స్
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • నూనె 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర కొద్దిగా

కరివేపాకు నువ్వుల రైస్ | How to make Curry leaves sesame rice Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మరీ మాడి పోయెంతగా వేయించకూడదు.
  2. చల్లారాక పొడి చేసుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.తరువాత కరివేపాకు పొడి వేసుకోవాలి .ఎక్కువగా వేగకూడదు మంట చిన్నగా పెట్టుకోవాలి.తగినంత ఉప్పువేసి కలపాలి.తరువాత అన్నం ,నువ్వుల పొడి,స్పున్ నువ్వులు వేసి అంత బాగా కలుపుకోవాలి.
  4. అంతా కలిపిన తరువాత కొత్తిమీర కూడా వేసుకోవాలి.తరువాత గిన్నెలో తీసుకోవాలి.పైన నువ్వులు,కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

నా చిట్కా:

కరివేపాకు కొద్దిగా ఒగురు ఉంటుంది.అందుకని ఇలా నువ్వుల పొడి వేసి చేస్తే కమ్మగా ఉండి బాగా తింటారు.

Reviews for Curry leaves sesame rice Recipe in Telugu (0)