హోమ్ / వంటకాలు / తోటకూర పులుసు కూర

Photo of Amaranth Green leaves curry by Pravallika Srinivas at BetterButter
739
1
0.0(0)
0

తోటకూర పులుసు కూర

Oct-11-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పులుసు కూర రెసిపీ గురించి

తోటకూరలోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కట్ట
  2. పచ్చిశనగపప్పు - 2 టేబుల్ స్పూన్
  3. ఉల్లిపాయ ముక్కలు - 1
  4. పచ్చిమిర్చి - 3
  5. టమాటో ముక్కలు - 1
  6. నీరు - తగినంత
  7. చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్
  8. ఉప్పు - 1 స్పూన్
  9. కారం - 1 స్పూన్
  10. నూనె - 2 టేబుల్ స్పూన్
  11. పోపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
  12. వెల్లులి రెబ్బలు - 10
  13. కర్వేపాకు - 2 రెమ్మలు
  14. ఇంగువ - చిటికెడు
  15. యండుమిరపకాయలు - 3

సూచనలు

  1. ముందుగా తోటకూర కట్టను తీస్కొని ఆకులు గిల్లి కాడలు లోనే పీచు వలిచి గిల్లి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక తెల్ల తపాల తీస్కొని తోటకూర , ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి తుంచినవి ,టమాటో ముక్కలు, నీరు వేసి ఉడికించుకోవాలి.
  3. తోటకూరబాగా ఉడికిన తర్వాత చింతపండు రసం, ఉప్పు ,కారం వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన మిశ్రమాన్ని గుంత గంటెతో బాగా మెదుపుకోవాలి.
  4. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,యండుమిరపకాయలు, వెల్లులి రెబ్బలు, కర్వేపాకు ,ఇంగువ వేసి కలుపుకోవాలి .అంతే రుచికరమైన తోటకూర పులుసు కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర