బచ్చలి ఆకు పప్పు కూర | Malabar spinach dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Malabar spinach dal recipe in Telugu,బచ్చలి ఆకు పప్పు కూర, Sree Vaishnavi
బచ్చలి ఆకు పప్పు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బచ్చలి ఆకు పప్పు కూర వంటకం

బచ్చలి ఆకు పప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Malabar spinach dal Recipe in Telugu )

  • బచ్చలి ఆకు 3 కప్పులు
  • కందిపప్పు 2 కప్పులు
  • ఎండుమిరపకాయలు 2-3
  • నీళ్లు తగినంత
  • పసుపు 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • నూనె 3 చెంచాలు
  • కారం తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ
  • పచ్చిమిర్చి 2-3

బచ్చలి ఆకు పప్పు కూర | How to make Malabar spinach dal Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కందిపప్పు నీళ్లు వేసి రెండు నుంచి మూడు పొంగులు రానివ్వాలి
  2. అప్పుడు అందులో తరిగిన బచ్చలికూర ఉప్పు పసుపు వేసి మరో పొంగు రానివ్వాలి
  3. ఉడికిన తరువాత అందులో నీళ్లు వార్చేయాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,ఇంగువ వేసి వేయించాలి
  5. అందులో తరిగిన పచ్చిమిర్చి , ఎండిమిర్చి వేసి వేయించాలి
  6. ఇప్పుడు అందులో ఉడికిన పప్పు వేసి కారం వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే

Reviews for Malabar spinach dal Recipe in Telugu (0)