కొత్తిమీర కూర | Coriander curry Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  11th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coriander curry recipe in Telugu,కొత్తిమీర కూర, Pravallika Srinivas
కొత్తిమీర కూరby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

కొత్తిమీర కూర వంటకం

కొత్తిమీర కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander curry Recipe in Telugu )

  • కొత్తిమీర - 2 కట్టలు
  • ఉల్లిపాయలు - 2
  • నూనె - 3 tbsp
  • పోపుదినుసులు - 1 tbsp
  • యండుమిరపకాయలు - 2
  • అల్లంవెల్లులి - 1/2 tbsp
  • శనగపిండి - 2 tbsp
  • ఉప్పు - 1/2 spn
  • కారం - 1/2 spn
  • నిమ్మరసం - 1 tbsp

కొత్తిమీర కూర | How to make Coriander curry Recipe in Telugu

  1. ముందుగా కొత్తిమీర కట్టను తీస్కొని కాడలు కట్ చేసి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక తరిగిన ఉల్లితరుగు అల్లంవెల్లులి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలిపి వేయించుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి.
  4. కొత్తిమీర వేగాక శనగపిండి ,ఉప్పు, కారం వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన కొత్తిమీర కూర రెడీ .

నా చిట్కా:

కొత్తిమీర కాడలు తో సహా వేయటం వలన ఫ్లఐవర్ ఇంకా పోషకాలు చక్కగా అందుతాయి ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబ్బట్టి చూసి వేసుకోవాలి

Reviews for Coriander curry Recipe in Telugu (0)