హోమ్ / వంటకాలు / కొత్తిమీర కూర

Photo of Coriander curry by Pravallika Srinivas at BetterButter
751
4
0.0(0)
0

కొత్తిమీర కూర

Oct-11-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కూర రెసిపీ గురించి

కొత్తిమీర ఆకులలో ప్రొటీన్లు, కొవ్వు, మినరల్స్, పీచు, కార్బోహైడ్రేట్లు, నీరు వుంటాయి. మినరల్స్, విటమిన్లు పరిశీలిస్తే వాటిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటీన్, ధయామైన్, రిబోఫ్లావిన్, నయాసిన్, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ లు వుంటాయి. కొత్తిమీర ఆకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. టానిక్ ల వలే పనిచేస్తుంది. అవి పొట్ట గడబిడను దూరం చేస్తాయి. బలపరుస్తాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర - 2 కట్టలు
  2. ఉల్లిపాయలు - 2
  3. నూనె - 3 tbsp
  4. పోపుదినుసులు - 1 tbsp
  5. యండుమిరపకాయలు - 2
  6. అల్లంవెల్లులి - 1/2 tbsp
  7. శనగపిండి - 2 tbsp
  8. ఉప్పు - 1/2 spn
  9. కారం - 1/2 spn
  10. నిమ్మరసం - 1 tbsp

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర కట్టను తీస్కొని కాడలు కట్ చేసి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక తరిగిన ఉల్లితరుగు అల్లంవెల్లులి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలిపి వేయించుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి.
  4. కొత్తిమీర వేగాక శనగపిండి ,ఉప్పు, కారం వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన కొత్తిమీర కూర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర