మెంతికూర పప్పు | Methi dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Methi dal recipe in Telugu,మెంతికూర పప్పు, Sree Vaishnavi
మెంతికూర పప్పుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

మెంతికూర పప్పు వంటకం

మెంతికూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi dal Recipe in Telugu )

 • మెంతికూర : మూడు కట్టలు
 • కందిపప్పు :వంద గ్రాములు
 • టమోటో ముక్కలు : అర కప్పు
 • పచ్చిమిర్చి ముక్కలు  : రెండు
 • కర్వేపాకు : ఒక రెమ్మ
 • ఎండుమిర్చి : రెండు
 • జీలకర్ర : ఒక స్పూన్
 • ఆవాలు : ఒక స్పూన్
 • ఇంగువ : చిటికెడు
 • పసుపు : అర స్పూన్
 • కారం : ఒక స్పూన్
 • ఆయిల్ : సరిపడంతా
 • కొత్తిమీర : కొద్దిగా
 • ఉప్పు తగినంత
 • నీళ్లు తగినంత

మెంతికూర పప్పు | How to make Methi dal Recipe in Telugu

 1. ముందుగా మెంతికూర ఆకులను తీసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి .
 2. పప్పు ని కూడా కడిగి ఒక అర గంట నాననిచ్చి , అందులో తగినంత వాటర్ వేసి ఉడకపెట్టుకుని పక్కనపెట్టుకోవాలి .
 3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , ఎండు మిర్చి , కర్వేపాకు , అన్ని వేసి వేపుకోవాలి , అందులోనే ఇంగువ కూడా వేసి వేపాలి .
 4. ఇప్పుడు ఇందులో , పచ్చిమిర్చిముక్కలు, వేసి బాగా వేయించాలి . తర్వాత ఇందులో మెంతికూర ను కూడా వేసి వేపి కొంచెం సేపు మగ్గక టమోటో ముక్కలను కూడా వేసి వేపుకుని ఒక 5 నిముషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి .
 5. మగ్గాక అందులో సాల్ట్ , కారం , పసుపు ,వేసి కలుపుకుని అందులో ముందుగా ఉడక పెట్టుకున్న పప్పు ను కూడా వేసి కలిపి అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసి కలిపి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి 
 6. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. 

Reviews for Methi dal Recipe in Telugu (0)