పాలకూర పాస్తా | Spinach pasta Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach pasta recipe in Telugu,పాలకూర పాస్తా, Pravallika Srinivas
పాలకూర పాస్తాby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర పాస్తా వంటకం

పాలకూర పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach pasta Recipe in Telugu )

  • పాలకూర - అర కట్ట
  • పాస్తా - 200 gms
  • ఉప్పు - తగినంత
  • ఆలివ్ ఆయిల్ - తగినంత
  • నీరు - తగినంత
  • టమాటో - 1
  • అల్లం - 1 అంగుళం
  • వెల్లులి - 4
  • ఉల్లగింజలు - 1 spn
  • చిల్లి సాస్ - 1 tbsp

పాలకూర పాస్తా | How to make Spinach pasta Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నిలో నీరు ,ఆలివ్ ఆయిల్, పాస్తా, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  2. మరొక స్టవ్ మీద కడిగి కట్ చేసుకున్న పాలకూర ,టమాటో వేసి ఉడికించుకోవాలి.
  3. 5 నిమిషాల్లో పాస్తా ఉడికిపోతుంది. చిల్లుల గిన్నిలో వేసి నీటిని తీసి పైన చల్లని నీరు పోయాలి. ఇలా చేయడం వలన పాస్తా ఉడకడం ఆగిపోతుంది.
  4. తర్వాత మరొక గిన్నిలో పాలకూర కూడా స్ట్రైన్ చేసి ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి.
  5. ఒక మిక్సర్ జార్ లో ఉడికించిన పాలకూర అల్లం వెల్లులి ఉడికించి పొట్టు తీసిన టమాటో వేసి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
  6. కడాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లగింజలు వేసి వేగాక పాలకూర ప్యూరీ, చిల్లి సాస్ వేసి పచ్చివాసన పోయాక పాస్తా వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన పాలకూర పాస్తా రెడీ .

నా చిట్కా:

ఇష్టం ఉన్నవాళ్లు చీజ్ వేస్కొవచ్చు పాలకూర ఉడికించేటపుడు మూత పెట్టకుండా ఉండటం వలన గ్రీన్గా ఉండి ఆర్టిఫిషల్ రంగు అవసరమే లేద

Reviews for Spinach pasta Recipe in Telugu (0)