పాలకూర మామిడికాయ పప్పు | Palak raw mango dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak raw mango dal recipe in Telugu,పాలకూర మామిడికాయ పప్పు, Sree Vaishnavi
పాలకూర మామిడికాయ పప్పుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాలకూర మామిడికాయ పప్పు వంటకం

పాలకూర మామిడికాయ పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak raw mango dal Recipe in Telugu )

  • పాలకూర 3 కట్టలు
  • మామిడికాయ 1
  • కంది పప్పు 1/2 కప్
  • పచ్చిమిర్చి 3-4
  • ఎండుమిర్చి 2
  • పసుపు 1/2 చెంచా
  • నీళ్లు తగినంత
  • నూనె 3 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • మునకాడ 1

పాలకూర మామిడికాయ పప్పు | How to make Palak raw mango dal Recipe in Telugu

  1. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసుకుని కందిపప్పు ,పాలకూర ,మామిడికాయ ,ఉప్పు, పసుపు ,వేసి బాగా కలిపి మూడు కూతలు వచ్చే వరకు ఉంచాలి
  2. అందులో మునకాడ ,పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మళ్ళి ఒక 8 నిమిషాలు ఉడికించాలి
  3. తరువాత కుక్కర్ మూత తీసి అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి
  4. మళ్ళి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,కరివేపాకు ,ఎండుమిర్చి వేసి వేయించి ఉడికిన పప్పు లో వేసుకోవడమే

Reviews for Palak raw mango dal Recipe in Telugu (0)