ఆకుకూరల పకోడీలు | Mixed leafy pakoda Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed leafy pakoda recipe in Telugu,ఆకుకూరల పకోడీలు, Pravallika Srinivas
ఆకుకూరల పకోడీలుby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

ఆకుకూరల పకోడీలు వంటకం

ఆకుకూరల పకోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed leafy pakoda Recipe in Telugu )

 • తోటకూర - 1 కప్పు
 • పాలకూర - 1 కప్పు
 • పుదీనా - 1 అరకప్పు
 • కొత్తిమీర - 1 అరకప్పు
 • కర్వేపాకు - 1 అరకప్పు
 • ఉల్లిపాయలు - 2
 • అల్లం ముక్కలు - 1 tbsp
 • ఉప్పు - తగినంత
 • బియ్యంపిండి - 1 కప్పు
 • శనగపిండి - 1 కప్పు
 • పచ్చిమిర్చి ముక్కలు - 6
 • సోంపు - 1 tbsp
 • జీలకర్ర - 1 spn
 • నూనె - తగినంత
 • నీరు - తగినంత

ఆకుకూరల పకోడీలు | How to make Mixed leafy pakoda Recipe in Telugu

 1. ముందుగా ఆకుకూరలు అన్నినింటిని గిల్లుకుని తరిగి పెట్టుకోవాలి. నేను తోటకూర ,పాలకూర, పుదీనా, కొత్తిమీర, కర్వేపాకు తీస్కున్నాను.
 2. ఒక బేసెను తీస్కొని కడిగి తరిగిన ఆకుకూరలు ,పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు సోంపు ,జీలకర్ర ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
 3. ఈ విధంగా చేయడం వలన ఆకుకూరలకు ఉప్పు కారం పట్టి నీరు బయటికి వస్తుంది .ఇందులో బియ్యంపిండి ,శనగపిండి వేసి అవసరం అయితే నీరు వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
 4. కడాయి పెట్టి డీపీఫ్రై కి నూనె వేసి కాగాక పిండిని పకోడీలు గా వేసి దోరగా వేయించుకోవాలి. అంతే రుచికరమైన ఆకుకూరలు పకోడీలు రెడీ...

నా చిట్కా:

ఆకుకూరలులో ఉప్పు శాతం ఉంటుంది కాబ్బట్టి ఉప్పు చూసి వేసుకోవాలి

Reviews for Mixed leafy pakoda Recipe in Telugu (0)