పాల కూర బంగాళ దుంప కూర | Alu paalak masala curry Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  12th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Alu paalak masala curry recipe in Telugu,పాల కూర బంగాళ దుంప కూర, Shobha.. Vrudhulla
పాల కూర బంగాళ దుంప కూరby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

0

పాల కూర బంగాళ దుంప కూర వంటకం

పాల కూర బంగాళ దుంప కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alu paalak masala curry Recipe in Telugu )

 • పాల కూర అర కిలో
 • దుంపలు రెండు
 • టమాటాలు మూడు
 • ఉల్లిపాయలు రెండు
 • అల్లంవెల్లుల్లి ముద్ద ఒక చెంచా
 • ఉప్పు తగినంత
 • పసుపు కొంచెము
 • కారము నాలుగు చంచాలు
 • ధనియాల పొడి రెండు చంచాలు
 • జీలకర్ర పొడి ఒక చెంచా
 • గరం మసాలా పొడి ఒక చెంచా
 • నూనె మూడు చంచాలు
 • జీలకర్ర ఒక అర చెంచా
 • పచ్చిమిరపకాయ ఒకటి

పాల కూర బంగాళ దుంప కూర | How to make Alu paalak masala curry Recipe in Telugu

 1. ముందుగా పాల కురని ఇసుక లేకుండా బాగా కడిగి తరిగి పెట్టుకోవలెను
 2. దుంపలు తొక్కలు తీసి కడిగి తరిగి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవలెను
 3. టమాటాలు కూడా కడిగి గ్రైండ్ చేసి ఉంచుకోవలెను
 4. ఇప్పుడు పాలకూర ని ఒక గిన్నీలో వేసి జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసి ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి ఒక్క మూడు నిమిషాల ఉడికించవలెను మూత పెట్టి.
 5. ఎక్కువగా ఉడికిస్తే పాలకురలో ఉన్న బలం పోతుంది .
 6. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేయవలెను.
 7. నూనె వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.
 8. ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించవలెను.
 9. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక అందులో పల్చగా తరిగి ఉంచిన దుంప ముక్కలు వేయాలి.
 10. దుంప ముక్కలు వేసాక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించాలి.
 11. ముందుగా పాలకూర ఉడికించి ఉంచుకుంటున్నాము కాబట్టి దుంపలుకుడా కాస్త వేగి మెత్తపడితే పాలకూర వేశక ఎక్కువగా ఉడికించ నవసరంలేదు
 12. దుంపలు మెత్తపడిన తరువాత అందులో రుబ్బి ఉంచిన టమాట ముద్ద ని వేసి బాగా వేయించాలి దగ్గర పడేదాక.
 13. టమాట ముద్ద వేగాక అందులో వరుసగా ఉప్పు,పసుపు,కారము,ధనియాల పొడి,జీలకర్ర పొడి ,.గరం మసాలా పొడి వేసి బాగా కాలియపెట్టాలి
 14. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి మరోసారి బాగా కలప వలెను
 15. పాల కూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త తగ్గించి వేసుకుంటే మంచిది
 16. ఇప్పుడు అన్ని వేసి బాగా కలిపాక అందులో ఉడికించి ఉంచిన పాల కూర వేసి కింద మీద బాగా కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
 17. ఇలా ఆఖరిలో ఉడికించటం వలన ఉప్పు మసాలా పొడులు అన్నీ కూరలో కలుస్తాయి .
 18. మంచి రుచి తో పాటు రంగు కూడా వస్తుంది.
 19. ఆఖరికి మొత్తం నీళ్లు ఇనికి పోకుండా కాస్త రసం ఉండేలా చూసి స్టవ్ ఆపి దించేయవలెను.
 20. అంతే ఎంతో రుచికరమయిన, ఆరోగ్యమయిన కూర తయారు.
 21. యి కూర వేడి వేడిగా అన్నాముతో కానీ రొట్టెలతో కానీ తింటే చాలా బాగుంటుంది...

నా చిట్కా:

పాలకూర ఒకవేళ ముందుగా ఉడికించకపోతే అన్నీ వేశక ఆఖరిగా అయిన వేసి ఉడికించి వచ్చు కానీ ఎక్కువగా ఉడికాకుండా చూసుకోవలెను

Reviews for Alu paalak masala curry Recipe in Telugu (0)