ఆలూ వాము ఆకు పకోడీ | Spoinach carom leaves fritters Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spoinach carom leaves fritters recipe in Telugu,ఆలూ వాము ఆకు పకోడీ, Sree Vaishnavi
ఆలూ వాము ఆకు పకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    13

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

ఆలూ వాము ఆకు పకోడీ వంటకం

ఆలూ వాము ఆకు పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spoinach carom leaves fritters Recipe in Telugu )

  • ఆలూ 2 ఉడికించింది
  • తరిగిన వాము ఆకు 1 కప్
  • సెనగపిండి 1/2 కప్
  • బియ్యంపిండి 5 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • గరం మసాలా 1 చెంచా
  • పచ్చిమిర్చి 2
  • నూనె వేయించడానికి సరిపడా
  • జీలకర్ర 1 చెంచా

ఆలూ వాము ఆకు పకోడీ | How to make Spoinach carom leaves fritters Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి జీలకర్ర వేసి వేగాక అందులో సన్నగా తరిగిన వాము ఆకు వేసి వేయించాలి
  2. అది వేగాక అందులో స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వేయించాలి
  3. అది వేగాక అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించాలి
  4. ఇప్పుడు అది చల్లారిన తరువాత అందులో సెనగపిండి, బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  6. నూనె కాగిన తరువాత అందులో పకోడీలు ల చేసుకోవాలి

Reviews for Spoinach carom leaves fritters Recipe in Telugu (0)