పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల) | Spinach chickpea flour pancake Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach chickpea flour pancake recipe in Telugu,పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల), Pravallika Srinivas
పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల)by Pravallika Srinivas
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల) వంటకం

పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach chickpea flour pancake Recipe in Telugu )

 • పాలకూర - 1 కప్పు
 • శనగపిండి - 1/2 కప్పు
 • ఉప్పు - తగినంత
 • పసుపు - చిటికెడు
 • కారం - 1/2 spn
 • జీలకర్ర - 1 tbsp
 • వంట సోడా - చిటికెడు
 • కొత్తిమీర తరుగు - 2 tbsp
 • నీరు - తగినంత
 • నూనె - తగినంత

పాలకూర శనగపిండి దోసె (పాలక్ బేసన్ చీల) | How to make Spinach chickpea flour pancake Recipe in Telugu

 1. ముందుగా పాలకూర ని కడిగి చివర్లో కాడలు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
 2. ఒక బేసన్ లో శనగపిండి ఉప్పు ,వంట సోడా ,జీలకర్ర ,కారం ,పసుపు వేసి కలుపుకోవాలి.
 3. ఇప్పుడు తరిగిన పాలకూర, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి తగినంత నీరు పోసి దోసెపిండి లాగా కలుపుకోవాలి.
 4. స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె వేసి కాలాక తయారు చేసిన పిండితో దోస వేసుకోవాలి. పైనుండి నూనె వేసి రెండు వైపులా సన్నని మంట పైన కలుచుకోవాలి.
 5. అంతే రుచికరమైన పాలకూర శనగపిండి దోస రెడీ.

నా చిట్కా:

పాలకూర లో ఉప్పు ఉంటుంది కాబ్బట్టి చూసి వేసుకోవాలి. వేడిగా తింటే చాలా బాగుంటాయి .వాము కూడా కలపవచ్చు.

Reviews for Spinach chickpea flour pancake Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo