వంకాయ కొత్తిమీర కారం | Brinjal coriander curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal coriander curry recipe in Telugu,వంకాయ కొత్తిమీర కారం, Sree Vaishnavi
వంకాయ కొత్తిమీర కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వంకాయ కొత్తిమీర కారం వంటకం

వంకాయ కొత్తిమీర కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal coriander curry Recipe in Telugu )

  • పొడుగు వంకాయలు 1/2 కేజీ
  • కొత్తిమీర 1 కట్ట
  • పచ్చిమిర్చి 10-15
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర 1 చెంచా
  • నూనె 5 చెంచాలు
  • ఎండుమిర్చి 1
  • కరివేపాకు 1 రెమ్మ

వంకాయ కొత్తిమీర కారం | How to make Brinjal coriander curry Recipe in Telugu

  1. ముందుగా వంకాయలిని బాగా కడిగి పొడుగు ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక రుబ్బు రోలు తీసుకుని అందులో కడిగి తరిగిన కొత్తిమీర ,పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి దంచుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి కాగనివ్వాలి
  4. నూనె వేగిన తరువాత అందులో జీలకర్ర ,ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో తరిగిన వంకాయ ముక్కలు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో దంచిన మిశ్రమం వేసుకోవాలి
  7. దానిని బాగా కలిపి ఒక 5 నిమిషాలు వేయించాలి అంతే

Reviews for Brinjal coriander curry Recipe in Telugu (0)