మునగాకు గుడ్డు పోర్ట్ | Drumstick leaves Egg curry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Drumstick leaves Egg curry recipe in Telugu,మునగాకు గుడ్డు పోర్ట్, Krishnakumari Marupudi
మునగాకు గుడ్డు పోర్ట్by Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

మునగాకు గుడ్డు పోర్ట్ వంటకం

మునగాకు గుడ్డు పోర్ట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick leaves Egg curry Recipe in Telugu )

 • నూనె 3 టేబుల్ స్పూన్
 • తాలింపు దినుసులు కొన్ని
 • కరివేపాకు ఒక రెమ్మ
 • ఉల్లిపాయలు ఒక కప్పు
 • వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
 • మునిగాకు 4 కప్పులు
 • గుడ్లు 6
 • ఉప్పు తగినంత
 • కారము తగినంత
 • పసుపు చిటికెడు
 • గరం మసాలా 1/2 spoon
 • కొత్తిమీర కొంచెము

మునగాకు గుడ్డు పోర్ట్ | How to make Drumstick leaves Egg curry Recipe in Telugu

 1. నూనె వేసుకుని అది వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసుకోవాలి.
 2. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు కూడా వేసుకోవాలి వేయించండి
 3. ఆ పైన ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లి ముక్కలు వేసుకొని , లేత బంగారు రంగు వచ్చాక పసుపు వేసుకోవాలి
 4. అల్లమువెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి
 5. ఆ తరువాత మునగాకు వేసుకోండి , అది వేగిన తరువాత ఉప్పు వేసుకోండి దీని వలన ఆకు లో ఉన్న నీరు బయటకు వస్తుంది చక్కగా వేగుతుంది
 6. ఆకు వేగిన తారువత గుడ్లు కొట్టి వేసుకోవాలి .
 7. బాగా ఆకు గుడ్లు కలిసేలా కలుపుకోవాలి
 8. తరువాత కారం తగినంత వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి
 9. 1/2 స్పూన్ గరం మసాల పొడి వేసుకుని కలుపుకోవాలి
 10. ఆఖరి లో కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన మునగాకు గుడ్డు కూర రెడీ .

Reviews for Drumstick leaves Egg curry Recipe in Telugu (0)