హోమ్ / వంటకాలు / మునగాకు గుడ్డు పోర్ట్

Photo of Drumstick leaves Egg curry by Krishnakumari Marupudi at BetterButter
74
1
0.0(0)
0

మునగాకు గుడ్డు పోర్ట్

Oct-13-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు గుడ్డు పోర్ట్ రెసిపీ గురించి

ఈ ఫ్రై వేడిగా తింటే చాలా బాగుంటుంది ఒక సారి మీరు ట్ర్య్ చేయండి

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • తేలికైనవి
 • ఇతర
 • ఆంధ్రప్రదేశ్
 • మితముగా వేయించుట
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. నూనె 3 టేబుల్ స్పూన్
 2. తాలింపు దినుసులు కొన్ని
 3. కరివేపాకు ఒక రెమ్మ
 4. ఉల్లిపాయలు ఒక కప్పు
 5. వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు
 6. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
 7. మునిగాకు 4 కప్పులు
 8. గుడ్లు 6
 9. ఉప్పు తగినంత
 10. కారము తగినంత
 11. పసుపు చిటికెడు
 12. గరం మసాలా 1/2 spoon
 13. కొత్తిమీర కొంచెము

సూచనలు

 1. నూనె వేసుకుని అది వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసుకోవాలి.
 2. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు కూడా వేసుకోవాలి వేయించండి
 3. ఆ పైన ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లి ముక్కలు వేసుకొని , లేత బంగారు రంగు వచ్చాక పసుపు వేసుకోవాలి
 4. అల్లమువెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి
 5. ఆ తరువాత మునగాకు వేసుకోండి , అది వేగిన తరువాత ఉప్పు వేసుకోండి దీని వలన ఆకు లో ఉన్న నీరు బయటకు వస్తుంది చక్కగా వేగుతుంది
 6. ఆకు వేగిన తారువత గుడ్లు కొట్టి వేసుకోవాలి .
 7. బాగా ఆకు గుడ్లు కలిసేలా కలుపుకోవాలి
 8. తరువాత కారం తగినంత వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి
 9. 1/2 స్పూన్ గరం మసాల పొడి వేసుకుని కలుపుకోవాలి
 10. ఆఖరి లో కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన మునగాకు గుడ్డు కూర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర