జల్ జీరా | Jaljeera Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Jaljeera by Pravallika Srinivas at BetterButter
జల్ జీరాby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

జల్ జీరా వంటకం

జల్ జీరా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jaljeera Recipe in Telugu )

 • పుదీనా _ అరకట్ట
 • కొత్తిమీర - అరకట్ట
 • అల్లం - 2 అంగుళాలు
 • పచ్చిమిర్చి - 2
 • నల్లుపు - తగినంత
 • జీలకర్ర - 2 tbsp
 • నిమ్మరసం - 1
 • ఆంచూర్ పొడి - 1 tbsp
 • ఇంగువ - చిటికెడు
 • పంచదార - 1 tbsp
 • నీరు - తగినంత
 • ఐస్ క్యూబ్స్ - తగినన్ని

జల్ జీరా | How to make Jaljeera Recipe in Telugu

 1. ముందుగా పుదీనా కడిగి ఆకులు వలుచుకోవాలి. కొత్తిమీర చివర్లు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి.
 2. ఒక కడై పెట్టి జీలకర్ర వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
 3. ఒక మిక్సర్ జార్ లో పుదీనా ,కొత్తిమీర, అల్లం ,పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
 4. ఇప్పుడు ఒక పెద్ద గిన్నిలో పుదీనా పేస్ట్,l నల్లుపు, చిటికెడు ఇంగువ ,ఆంచూర్ పొడి ,నిమ్మరసం ,పంచదార,ముందుగా పొడి చేసిన జీలకర్ర పొడి వేసి నీరు పోసి బాగా కలుపుకోవాలి.
 5. ఒక 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పుదీనా జీలకర్ర ఫ్లైవర్ నీటికి బాగా పడుతుంది .
 6. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి వడకట్టే దాంట్లో నుండి తయారైన జల్ జీరా పోసుకోవాలి. అంతే రుచికమైన జల్ జీరా పానీయం రెడీ ....

నా చిట్కా:

అప్పటికప్పుడు వేయించి పొడి చేస్కోవడం వలన మంచి రుచి & సువాసన .పుదీనా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి.

Reviews for Jaljeera Recipe in Telugu (0)