కంద బచ్చలి ఆవ కూర | Elephant yam Malabar Spinach curry Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Elephant yam Malabar Spinach curry recipe in Telugu,కంద బచ్చలి ఆవ కూర, Sudha Badam
కంద బచ్చలి ఆవ కూరby Sudha Badam
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

కంద బచ్చలి ఆవ కూర వంటకం

కంద బచ్చలి ఆవ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Elephant yam Malabar Spinach curry Recipe in Telugu )

  • కంద 1/4 కేజీ
  • బచ్చలి కూర 1 కట్ట
  • చింతపండు చిన్న నిమ్మకాయంత
  • ఆవాలు 2 స్పూన్లు
  • ఎండుమిర్చి 4
  • పచ్చిమిర్చి 3
  • చిన్న అల్లం ముక్క
  • పోపు దినుసులు-సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుసనగగుళ్లు 1 స్పూను
  • నూనె 3 స్పూన్లు
  • ఉప్పు సరిపడినంత
  • పసుపు చిటికెడు

కంద బచ్చలి ఆవ కూర | How to make Elephant yam Malabar Spinach curry Recipe in Telugu

  1. కంద తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కుక్కర్ లో 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  2. బచ్చలి కూర సన్నగా తరుగుకోవాలి.
  3. ఆవాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 3, కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.
  4. పాన్ లో నూనె వేసుకుని మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,వేరుసనగగుళ్లు అన్నీ వేసుకుని ఎర్రగా వేగనివ్వాలి.
  5. వేగాక బచ్చలి కూర వేసి మగ్గనివ్వాలి.
  6. బచ్చలి కూర మగ్గాక కొద్దిగా చింతపండు పులుసు,ఉప్పు, పసుపు వేసి దగ్గర పడ్డాక ఉడికించిన కంద ముక్కలు వేసుకోవాలి.
  7. అన్నీ బాగా కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి నూరిన ఆవ ముద్దలో ఒక స్పూను నూనె వేసి కలుపుకుని దానిని కూరలో వేసి కలపాలి

Reviews for Elephant yam Malabar Spinach curry Recipe in Telugu (0)