హోమ్ / వంటకాలు / కంద బచ్చలి ఆవ కూర

Photo of Elephant yam Malabar Spinach curry by Sudha Badam at BetterButter
779
6
0.0(0)
0

కంద బచ్చలి ఆవ కూర

Oct-14-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంద బచ్చలి ఆవ కూర రెసిపీ గురించి

బచ్చలి కూరతో చేసుకునే ఒక సాంప్రదాయక వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కంద 1/4 కేజీ
  2. బచ్చలి కూర 1 కట్ట
  3. చింతపండు చిన్న నిమ్మకాయంత
  4. ఆవాలు 2 స్పూన్లు
  5. ఎండుమిర్చి 4
  6. పచ్చిమిర్చి 3
  7. చిన్న అల్లం ముక్క
  8. పోపు దినుసులు-సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుసనగగుళ్లు 1 స్పూను
  9. నూనె 3 స్పూన్లు
  10. ఉప్పు సరిపడినంత
  11. పసుపు చిటికెడు

సూచనలు

  1. కంద తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కుక్కర్ లో 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  2. బచ్చలి కూర సన్నగా తరుగుకోవాలి.
  3. ఆవాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 3, కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.
  4. పాన్ లో నూనె వేసుకుని మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,వేరుసనగగుళ్లు అన్నీ వేసుకుని ఎర్రగా వేగనివ్వాలి.
  5. వేగాక బచ్చలి కూర వేసి మగ్గనివ్వాలి.
  6. బచ్చలి కూర మగ్గాక కొద్దిగా చింతపండు పులుసు,ఉప్పు, పసుపు వేసి దగ్గర పడ్డాక ఉడికించిన కంద ముక్కలు వేసుకోవాలి.
  7. అన్నీ బాగా కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి నూరిన ఆవ ముద్దలో ఒక స్పూను నూనె వేసి కలుపుకుని దానిని కూరలో వేసి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర