పాలకూర ఇడ్లీలు | Spinach Idly Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach Idly recipe in Telugu,పాలకూర ఇడ్లీలు, Pravallika Srinivas
పాలకూర ఇడ్లీలుby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పాలకూర ఇడ్లీలు వంటకం

పాలకూర ఇడ్లీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach Idly Recipe in Telugu )

  • ఇడ్లీ పిండి - 250 gms
  • పాలకూర - 1 చిన్న కట్ట
  • ఉప్పు - తగినంత
  • నీరు - తగినంత

పాలకూర ఇడ్లీలు | How to make Spinach Idly Recipe in Telugu

  1. ఇడ్లీ పిండి తయారీ అందరికి తెలిసే ఉంటుంది ఒక కప్ మినపగుండ్ల కి 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ 4 గంటలు విడివిడిగా నానపెట్టిన తర్వాత గ్రైండర్ లో మినపగుండ్లు రుబ్బుకొని రవ్వను పిండుకుని రుబ్బు లో కలుపుకోవాలి. ఒక రాత్రి అంతా పులవనివ్వాలి.
  2. ముందుగా ఒక పాలకూర కట్ట తీస్కుని కడిగి కట్ చేసి ఒక గిన్నిలో లో నీరు పోసి ఉడకనివ్వాలి.
  3. ఉడికిన తర్వాత చిల్లులగిన్నెలో నీటిని వడగట్టి పైనుండి చల్లని నీటిని పోయాలి.
  4. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో పాలకూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. ముందుగా తయారైన ఇడ్లీ పిండి లో ఈ పాలకూర పేస్ట్ ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  6. ఇడ్లీ పాత్ర లో నీరు పోసి కాగాక ఇడ్లీ రేకుల మీద పిండి వేస్కుని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. అంతే రుచికరమైన పాలకూర ఇడ్లీలు రెడీ...

నా చిట్కా:

కావాలి అనుకుంటే పోపు పెట్టి అందులో ఇష్టమైన కూరగాయలు ముక్కలు (ఉదా: క్యారెట్ ) వేయించి పిండిలో కలుపుకోవచ్చు.

Reviews for Spinach Idly Recipe in Telugu (0)