హోమ్ / వంటకాలు / పాలకూర ఇడ్లీలు

Photo of Spinach Idly by Pravallika Srinivas at BetterButter
212
3
0(0)
0

పాలకూర ఇడ్లీలు

Oct-14-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ఇడ్లీలు రెసిపీ గురించి

ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది .అనారోగ్యంతో ఉన్న ఎవరికైనా పెట్టాలి అంటే ముందు గుర్తుకువచ్చేది ఇడ్లీ. ఉడికించిన పాలకూర ఇడ్లీ పిండిలో వేసి తయారు చేసే ఒక ఆరోగ్యమైన అల్పాహారం పాలకూర ఇడ్లీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. ఇడ్లీ పిండి - 250 gms
  2. పాలకూర - 1 చిన్న కట్ట
  3. ఉప్పు - తగినంత
  4. నీరు - తగినంత

సూచనలు

  1. ఇడ్లీ పిండి తయారీ అందరికి తెలిసే ఉంటుంది ఒక కప్ మినపగుండ్ల కి 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ 4 గంటలు విడివిడిగా నానపెట్టిన తర్వాత గ్రైండర్ లో మినపగుండ్లు రుబ్బుకొని రవ్వను పిండుకుని రుబ్బు లో కలుపుకోవాలి. ఒక రాత్రి అంతా పులవనివ్వాలి.
  2. ముందుగా ఒక పాలకూర కట్ట తీస్కుని కడిగి కట్ చేసి ఒక గిన్నిలో లో నీరు పోసి ఉడకనివ్వాలి.
  3. ఉడికిన తర్వాత చిల్లులగిన్నెలో నీటిని వడగట్టి పైనుండి చల్లని నీటిని పోయాలి.
  4. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో పాలకూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. ముందుగా తయారైన ఇడ్లీ పిండి లో ఈ పాలకూర పేస్ట్ ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  6. ఇడ్లీ పాత్ర లో నీరు పోసి కాగాక ఇడ్లీ రేకుల మీద పిండి వేస్కుని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. అంతే రుచికరమైన పాలకూర ఇడ్లీలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర