పాలకూర పప్పు కూర | Spinach toor dal curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach toor dal curry recipe in Telugu,పాలకూర పప్పు కూర, Sree Vaishnavi
పాలకూర పప్పు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

పాలకూర పప్పు కూర వంటకం

పాలకూర పప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach toor dal curry Recipe in Telugu )

  • పాలకూర తరిగినది 2 కప్పులు
  • కందిపప్పు 1 కప్
  • ఎండుమిర్చి 3
  • పచ్చిమిర్చి 3-4
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 5 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • నీళ్లు తగినంత
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత

పాలకూర పప్పు కూర | How to make Spinach toor dal curry Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుని పాలకూర కూడా వేసి ఒక పొంగు రానివ్వాలి
  2. అందులో కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి మరో రెండు పొంగులు రానిచ్చి వార్చుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి
  4. వేయించిన తరువాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉడికిన కందిపప్పు, పాలకూర వేసి ఒక మూడు నుంచి ఐదు నిముషాలు వేయించాలి
  6. అందులో తగినంత కారం వేసుకుని మరో మూడు నిముషాలు వేయించాలి అంతే

Reviews for Spinach toor dal curry Recipe in Telugu (0)