గోంగూర గుత్తి వంకాయ కర్రీ | GONGURA guthi vankayi curry Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GONGURA guthi vankayi curry recipe in Telugu,గోంగూర గుత్తి వంకాయ కర్రీ, Krishnakumari Marupudi
గోంగూర గుత్తి వంకాయ కర్రీby Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

గోంగూర గుత్తి వంకాయ కర్రీ వంటకం

గోంగూర గుత్తి వంకాయ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA guthi vankayi curry Recipe in Telugu )

 • గుత్తి వంకాయలు 15
 • గోంగూర పెద్దవి ఒక కట్ట
 • పచ్చి సెనగ పప్పు 1/2 కప్
 • మినప పప్పు 1/2 కప్
 • వేరుశెనగ పప్పు 1/2 కప్
 • ధనియాలు 1/2 కప్
 • నువ్వులు 2 టేబుల్ స్పూన్
 • జీరా 2 టేబుల్ స్పూన్
 • ఉప్పు తగినంత
 • కారము తగినంత
 • పసుపు చిటికెడు
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
 • టొమాటోలు 2 పెద్దవి
 • ఉల్లిపాయలు రెండు
 • పచ్చిమిర్చి 4
 • గరం మసాలా 1/2 స్పూన్
 • కొత్తిమీర ఒక కట్ట

గోంగూర గుత్తి వంకాయ కర్రీ | How to make GONGURA guthi vankayi curry Recipe in Telugu

 1. ముందుగా గోంగూర ఏరి కడిగి పెట్టుకోవాలి,
 2. వంకాయలు గుత్తి లా కట్ చేసి పసుపు ఉప్పు కలిపి నీళ్ల లో వేసుకోవాలి
 3. బాండీ పెట్టుకుని వేడి ఎక్కాక ధనియాలు, పచ్చి సెనగా పప్పు , వేరుశెనగ పప్పు, మినప పప్పు, జీరా, నువ్వులు వేసి వేయించుకుని, మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి
 4. గుత్తి వంకాయలు లో ఈ పొడిని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి
 5. తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి
 6. టొమాటోలు కూడా మిక్సీ వేసుకుని పేస్ట్ రెడి చేసుకుని పక్కనపెట్టుకోవాలి
 7. అదే బాండీ లో నూనె వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
 8. మళ్ళీ కొంచెము నూనె వేసుకుని ఉల్లి, మిర్చి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి
 9. అల్లమువెల్లుల్లి పేస్ట్ , పసుపు వేసుకొని పచ్చి వాసనా పోయేలా వేయించుకోవాలి
 10. తరువాత టొమాటోల పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి
 11. తరువాత గోంగూర వేసి కలపాలి , అది బాగా కలసిన తరువాత
 12. మిగిలిన పొడి వేసి బాగా కలపాలి
 13. వేయించుకున్న గుత్తి వంకాయాలు వేసి కలపాలి ,
 14. ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి
 15. లాస్ట్ లో కొత్తిమీరా వేసి స్టీవ్ ఆఫ్ చేయాలి

Reviews for GONGURA guthi vankayi curry Recipe in Telugu (0)