హోమ్ / వంటకాలు / బచ్చలి టమాటో పులుసు కూర

Photo of Malabar spinach tomato gravy curry by Pravallika Srinivas at BetterButter
850
1
0.0(0)
0

బచ్చలి టమాటో పులుసు కూర

Oct-14-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బచ్చలి టమాటో పులుసు కూర రెసిపీ గురించి

బచ్చలికూర లో విటమిన్ సి కాల్షియమ్ & ఐరన్ పుష్కలంగా ఉంటాయి.ఈ ఆకుకూర చాల త్వరగా ఉడికిపోతుంది. దీనితో బజ్జి & పకోడీ కూడా బాగుంటాయి.బచ్చలి టమాటో కలిపి చేసే ఈ కూర అమోఘం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బచ్చలికూర - 1 కట్ట
  2. టమాటో - 4
  3. ఉల్లిపాయలు - 2
  4. పచ్చిశనగపప్పు - 2 tbsp
  5. నీరు - తగినంత
  6. చింతపండు - 3 రెబ్బలు
  7. ఉప్పు - తగినంత
  8. కారం - 1 spn
  9. నూనె - 2 tbsp
  10. పోపు దినుసులు - 1 tbsp
  11. వెల్లుల్లిరెబ్బలు - 10
  12. ఇంగువ - చిటికెడు
  13. కర్వేపాకు - 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా బచ్చలికూర ని కడిగి గిల్లుకుని కట్ చేసుకోవాలి. చింతపండు వేడి నీటిలో నానపెట్టాలి. టొమాటోలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి.
  2. ఒక తెపాలలో తరిగిన బచ్చలికూర, టమాటో ,ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, తగినన్ని నీరు వేసి ఉడికించుకోవాలి.
  3. మెత్తగా ఉడికిన తర్వాత గుంత గరిటతో మెదుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం ,ఉప్పు ,కారం వేసి కొంచం దగ్గరపడేలాగా ఉడికించుకోవాలి.
  4. ఆ తర్వాత కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,వెల్లుల్లిరెబ్బలు , ఇంగువ ,కర్వేపాకు వేసి చిటపటలాడాక ఉడికించిన బచ్చలి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన బచ్చలి టమాటో పులుసు కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర