వెజ్ మోమోస్ | VEG MOMOS Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • VEG MOMOS recipe in Telugu,వెజ్ మోమోస్, Tejaswi Yalamanchi
వెజ్ మోమోస్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  90

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

వెజ్ మోమోస్ వంటకం

వెజ్ మోమోస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VEG MOMOS Recipe in Telugu )

 • దో(మైదా ముద్ద కోసం):
 • మైదాపిండి : 2 కప్స్
 • నీళ్లు : పిండి కలుపుకోవడానికి సరిపడా
 • పాలకూర : చిన్న కట్ట ఒకటి
 • పిండిలో నింపడం కోసం కావలసిన పదార్థాలు:
 • తరిగిన క్యాబేజి : 1 కప్(50 గ్రాములు)
 • తరిగిన క్యాప్సికమ్ : 1 కప్(50 గ్రాములు)
 • నూనె, ఉప్పు : కావలసినంత
 • సోయాసాస్ : 1 tbsp
 • మిరియాల పొడి : 1/4 tsp

వెజ్ మోమోస్ | How to make VEG MOMOS Recipe in Telugu

 1. రెండు కప్పుల మైదా,ఒక కప్ నీరు,ఒక కప్ పాలకూర జ్యూస్ తీసుకోండి(పాలకురని కడిగి మిక్సీ లో వేసి పేస్ట్లాగా చేసి వడకటండీ)
 2. మైదాపిండిలో నీళ్లు పోసి బాగా కలపి చపాతి ముద్దలాచేసుకోవాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్లో చుట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 3. మైదాపిండిలో పాలకూర జ్యూస్ పోసి బాగా కలపి చపాతి ముద్దలాచేసుకోవాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్లో చుట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 4. రెండు మైదా ముద్దాలని తీసుకొని సమానంగా వెడల్పుగా చేస్కోండి.
 5. సమానంగా ముక్కలు చేస్కోండి
 6. పిండిని చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి.
 7. ముందుగా తెల్ల పూరి తరువాత పచ్చ పూరి అలా ఒకదాని పైన ఇంకొకటి అమర్చండి
 8. మొత్తం చేసుకొని అమార్చక మధ్యకి కట్ చేస్కోండి
 9. మధ్యకి కట్ చేసిన బాగలని ఒకదాని మీద ఇంకొకటి పెట్టి ప్లాస్టిక్ వ్రాప్ లో చుట్టి ఫ్రిడ్జ్ లో ఒక 30 నిమిషాలు ఉంచండి
 10. ఇప్పుడు పిండిలో నింపడం కోసం బాండీ పెట్టి నూనె వేసి కాగాక క్యాప్సికమ్,క్యాబేజి ముక్కలు వేసి కాస్త వేగాక సోయాసాస్ ,ఉప్పు,మిరియాలపొడి వేసి కలిపి ఒక నిమిషం ఉంచి దించేయండి.
 11. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన పూరీలని తీసి కత్తితో నిలువుగా కట్ చేసుకోవాలి
 12. చపాతీ కర్ర తో ఇలా సన్నగా చేసుకోవాలి
 13. దానిలో స్టూఫిన్గ్ పెట్టి నీటితో అన్ని వెయిపుల మూయలి
 14. ఇలా కావల్సినన్ని తయారు చేసి పెట్టుకోవాలి
 15. నేను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించను.దాని కోసం క్రింద గిన్నెలో నీరు పోసి పెట్టాను
 16. అవి బాగా మరిగాక.పైన ట్రే లో మోమోస్ పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి
 17. అంతే నోరూరించే వెజ్ మోమోస్ తయారు..... 

నా చిట్కా:

పిండి లో నింపడానికి మీరు ఏ కూరగాయాలు అయిన వాడొచ్చు

Reviews for VEG MOMOS Recipe in Telugu (0)