ఆలూ పాలక్ | Potato Spinach Gravy Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Potato Spinach Gravy  by Pravallika Srinivas at BetterButter
ఆలూ పాలక్by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఆలూ పాలక్ వంటకం

ఆలూ పాలక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato Spinach Gravy Recipe in Telugu )

  • పాలకూర - 1 కట్ట
  • ఆలూ - 4
  • నీరు - తగినంత
  • నూనె - 3 tbsp
  • కొత్తిమీర - 4 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 2
  • సోంపు - 1/2 tbsp
  • జీలకర్ర - 1/2 tbsp
  • అల్లం ముక్కలు - 1 tbsp
  • వెల్లులి ముక్కలు - 1 tbsp
  • పాలమీగడ - తగినంత

ఆలూ పాలక్ | How to make Potato Spinach Gravy Recipe in Telugu

  1. ముందుగా పాలకూర ని కడిగి క్సుట్ చేసి గిన్నిలో నీరు పోసి ఉడికించి నీరు వడగట్టి పైన చన్నీళ్లుపోయాలి.
  2. కుక్కర్ లో ఆలూ నీరు ఉప్పు వేసి పొట్టుతో సహా 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  3. ప్రెషర్ పోయాక పొట్టు తీసి పెద్ద ముక్కలు కట్ చేసి నూనె లో లైట్ గా వేయించుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సర్ జార్ లో ఉడికించిన పాలకూర ,కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. కడై పెట్టి నూనె వేసి కాగాక సోంపు, జీలకర్ర ,అల్లం ,వెల్లులి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
  6. తర్వాత ముందుగా తయారు చేసిన పాలకూర పేస్ట్ వేసి నీరు పోసి పచ్చివాసన పోయేవరకు ఉడికించి వేయించిన ఆలూ కూడా వేసి కలిపి మరికొంచెం ఉడికించుకోవాలి.
  7. అంతే సెర్వింగ్ బౌల్ లో తీస్కుని పైనుండి పాలమీగడ వేసుకోవాలి.

నా చిట్కా:

పాలకూర ను మరీ ఎక్కువ ఉడికించకూడదు ఎందుకంటే పోషకాలు రంగు తగ్గుతాయి. కావాలి అంటే హోల్ గరం మసాలా దినుసులు వేస్కొవచ్చు.

Reviews for Potato Spinach Gravy Recipe in Telugu (0)