తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు) | Amaranth leaves muddipalya(muddapappu) Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Amaranth leaves muddipalya(muddapappu) recipe in Telugu,తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు), Harini Balakishan
తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు)by Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు) వంటకం

తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranth leaves muddipalya(muddapappu) Recipe in Telugu )

 • నాలుగు కప్పుల తరిగిన తోటకూర
 • పావుకప్పు కంది పప్పు
 • పసుపు, ఇంగువ
 • పల్లీ నూనె రెండు గరిటెడు
 • కారంపుడి ఒకచంచా
 • రెండు చంచా బియ్యం లేక గోధుమ పిండి
 • పావు కప్పు చింతపండు రసము
 • చిన్న బెల్లంముక్క
 • ఆవాలు , జిలకర
 • పల్లీలు , కరివేపాకు
 • రుచికి ఉప్పు

తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు) | How to make Amaranth leaves muddipalya(muddapappu) Recipe in Telugu

 1. ముందుగ కందిపప్పును కొద్దిగ పసుపు, నూనె వేసి కుకర్లో మెత్తగా ఉడకబెట్టాలి
 2. తోటకూర తరిగి కడిగి పెట్టు కోవాలి
 3. మూకుడులో కొద్దిగ నూనె పోసి , ఆకుకూర వేసి వేపి, కొద్దిగ నీరు వేసి మగ్గనివ్వాలి
 4. చింతపులుసు వేసి మసలిన తర్వాత బెల్లం , కారంపుడి వేయ్యాలి
 5. ఉడికిన పప్పు వేసి ఉడకబెట్టాలి
 6. రెండు చంచాల బియ్యం లేదా గోధుమ పిండి లో కొద్దిగ నీరు కలిపి...
 7. ఉడుకుతున్న పప్పులోవేసి, సరిపడ ఉప్పు వేయ్యాలి
 8. డిష్ ఆవుట్ చేసుకోవాలి
 9. పల్లీ నూనె, ఆవాలు, జిలకర, ఇంగువ , పసుపు, ఎండు మిర్చీ పోపు తయారు చేసి...
 10. పప్పులో వేయ్యాలి

నా చిట్కా:

పాలకూరతో కూడ ఇలా చేసుకోవచ్చు

Reviews for Amaranth leaves muddipalya(muddapappu) Recipe in Telugu (0)