హోమ్ / వంటకాలు / కరివేపాకు నువ్వుల కారంపొడి

Photo of Curry leaves and sesame seeds spice powder by Kavitha Perumareddy at BetterButter
924
3
0.0(0)
0

కరివేపాకు నువ్వుల కారంపొడి

Oct-16-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు నువ్వుల కారంపొడి రెసిపీ గురించి

కరివేపాకు ,నువ్వులు రెండు హెల్త్ కు చాలా మంచిది ...కరివేపాకు ఎక్కువ గా తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పొడి కురాలల్లో ,పులుసుల్లో,ప్రైడ్ రైస్ ల్లో ఒక స్పూన్ వేసుకొంటే వాటికి రుచి పెరుగుతుంది .ఇలా చేసి పెడితే ఇంటిలో అందరూ కరివేపాకు ను తిని దాని లాభాలు పొందుతారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కరివేపాకు ఒక పెద్ద కప్
  2. నువ్వులు 4 స్పూన్స్
  3. ఎండుమిర్చి 10
  4. వెల్లుల్లి 20 రెబ్బలు
  5. జీలకర్ర 2 స్పూన్
  6. ధనియాలు 2 స్పూన్
  7. మినప్పప్పు 2 స్పూన్స్
  8. నూనె స్పున్
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కరివేపాకును కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి .
  2. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి మినపప్పు,జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి వేసి వేపుకున్న తరువాత కరివేపాకును వేసి వేపుకోవాలి .చివరగా నువ్వులు వేసి వేపుకోవాలి.
  3. తరువాత వేయించిన వాటిని చల్లారనిచ్చి ,మిక్షిలో వేసుకొని తగినంత ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు పొత్తుతీయకుండా వేసి అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి .అంతే కరివేపాకు నువ్వుల కారం పొడి రెడీ .
  4. పొడి చల్లారిన తరువాత గాలి చొరబడని డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలి.నెలరోజులు నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర