పాలకూర, క్యాప్సికమ్ రైస్ | Spinach and Capsicum rice Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach and Capsicum rice recipe in Telugu,పాలకూర, క్యాప్సికమ్ రైస్, Chandrika Marripudi
పాలకూర, క్యాప్సికమ్ రైస్by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పాలకూర, క్యాప్సికమ్ రైస్ వంటకం

పాలకూర, క్యాప్సికమ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach and Capsicum rice Recipe in Telugu )

  • బియ్యం : 2 కప్పులు
  • పాలకూర : 3 కట్టలు
  • క్యప్సికమ్ : 2
  • పచ్చిమిర్చి : 4
  • ఉల్లిపాయ : 1
  • నూనె : 4స్పూన్లు
  • దాల్చిన చెక్క : 2
  • లవంగాలు : 5
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు : తగినంత

పాలకూర, క్యాప్సికమ్ రైస్ | How to make Spinach and Capsicum rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యంతో పొడి పొడిగా అన్నం వండుకోవాలి.
  2. పాలకూర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
  3. క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక చెక్క,లవంగాలు వేసి వేపి ఉల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి.
  5. 1స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి వేగనివ్వాలి.
  6. ఇపుడు తరిగిన పాలకూర కూడా వేసి మగ్గనివ్వాలి.
  7. పాలకూర బాగా మగ్గాక కొద్దిగా ఉప్పు వేసి ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి.
  8. బాగా కలిపి 2 నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర, క్యాప్సికమ్ రైస్ రెడీ.

నా చిట్కా:

పాలకూరలో ఉప్పు ఉంటుంది. కాబట్టి ఉప్పు తక్కువగా వేసుకోవాలి.

Reviews for Spinach and Capsicum rice Recipe in Telugu (0)