హోమ్ / వంటకాలు / పాలకూర, క్యాప్సికమ్ రైస్

Photo of Spinach and Capsicum rice by Chandrika Marripudi at BetterButter
443
2
0.0(0)
0

పాలకూర, క్యాప్సికమ్ రైస్

Oct-16-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర, క్యాప్సికమ్ రైస్ రెసిపీ గురించి

పాలకూర,అన్నంతో చేసే ఒక సులువైన వంటకం.టిఫిన్, లంచ్, డిన్నర్ ఎపుడైనా చేసుకోవచ్చు. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఆకుకూరలు తినడం చాలా అవసరం .ఇలా రోజుకోరకంగా చేసుకుంటే ఆకుకూరలు బోర్ కొట్టకుండా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం : 2 కప్పులు
  2. పాలకూర : 3 కట్టలు
  3. క్యప్సికమ్ : 2
  4. పచ్చిమిర్చి : 4
  5. ఉల్లిపాయ : 1
  6. నూనె : 4స్పూన్లు
  7. దాల్చిన చెక్క : 2
  8. లవంగాలు : 5
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  10. ఉప్పు : తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యంతో పొడి పొడిగా అన్నం వండుకోవాలి.
  2. పాలకూర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
  3. క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక చెక్క,లవంగాలు వేసి వేపి ఉల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి.
  5. 1స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి వేగనివ్వాలి.
  6. ఇపుడు తరిగిన పాలకూర కూడా వేసి మగ్గనివ్వాలి.
  7. పాలకూర బాగా మగ్గాక కొద్దిగా ఉప్పు వేసి ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి.
  8. బాగా కలిపి 2 నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర, క్యాప్సికమ్ రైస్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర