చింతకాయ పప్పు | Chinthakaaya pappu Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chinthakaaya pappu recipe in Telugu,చింతకాయ పప్పు, Anitha Rani
చింతకాయ పప్పుby Anitha Rani
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

About Chinthakaaya pappu Recipe in Telugu

చింతకాయ పప్పు వంటకం

చింతకాయ పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chinthakaaya pappu Recipe in Telugu )

 • కంది పప్పు...100గ్రా
 • పచ్చిమిర్చి...8...
 • చింతకాయలు....6..చిన్నవి
 • పసుపు...1 స్పూన్
 • ఉప్పు...1స్పూన్
 • పూపుగింజలు...1స్పూన్
 • ఉల్లిపాయ...1
 • వెల్లుల్లిరెబ్బలు....6
 • కరివేపాకు...కొత్తిమీర... కొద్దిగా
 • నూనె....2స్పూన్స్

చింతకాయ పప్పు | How to make Chinthakaaya pappu Recipe in Telugu

 1. కుక్కర్ లో కందిపప్పు కడిగి అందులో,పచ్చిమిర్చి పసుపు, కొద్దిగా ఆయిల్,జీలకర్ర వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
 2. ఇంకొక గిన్నె లో చింతకాయలు బాగా కడిగి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి....చల్లారిన తరవాత గుజ్జు తీసుకోవాలి.
 3. పప్పు లో కొద్దిగా ఉప్పు వేసి పప్పు,మిర్చి ని మెత్తగా పప్పు గుత్తి తో యనపాలి. దానిలో చింత కాయ గుజ్జు కలుపుకోవాలి.
 4. పాన్ వేడి అయ్యాక నూనెపూపుగింజలు, ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేగాక మెత్తగా చేసుకున్న పప్పు ను పోపు లో వేసి ఉడకనివ్వాలి దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
 5. రుచి గా ఉండే చింతకాయ పప్పు తయారు.

నా చిట్కా:

చింతకాయ లు పక్కన ఉడికించి గుజ్జు తీ సుకోవడము వలన పులుపు చూసుకొని వేసుకోవచ్చు.

Reviews for Chinthakaaya pappu Recipe in Telugu (0)