పాలకూర కొత్తిమీర జంతికలు | Palak coriander jantikalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak coriander jantikalu recipe in Telugu,పాలకూర కొత్తిమీర జంతికలు, Sree Vaishnavi
పాలకూర కొత్తిమీర జంతికలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర కొత్తిమీర జంతికలు వంటకం

పాలకూర కొత్తిమీర జంతికలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak coriander jantikalu Recipe in Telugu )

  • పాలకూర ప్యూరీ 1/2 కప్
  • కొత్తిమీర పేస్ట్ 2 చెంచాలు
  • నువ్వులు 4 చెంచాలు
  • బియ్యం పిండి 2 కప్పులు
  • బట్టర్ 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా
  • వాము 1/2 చెంచా
  • సెనగపిండి 2 చెంచాలు

పాలకూర కొత్తిమీర జంతికలు | How to make Palak coriander jantikalu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో బియ్యంపిండి, సెనగపిండి వేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం ,వాము, బట్టర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో పాలక్ ప్యూరీ, కొత్తిమీర వేసుకోవాలి
  4. అందులో నీళ్లు పోసుకుని బాగా కలిసేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని దానికి నూనె రాసి పిండి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి కాచుకోవాలి
  7. నూనె వేడి అయ్యాక అందులో వేసుకోవాలి
  8. అది రెండు పక్కల వేయించుకోవాలి అంతే

Reviews for Palak coriander jantikalu Recipe in Telugu (0)