పాలకూర ఖాన్డ్వి | Spinach khandvi Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach khandvi recipe in Telugu,పాలకూర ఖాన్డ్వి, Pravallika Srinivas
పాలకూర ఖాన్డ్విby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర ఖాన్డ్వి వంటకం

పాలకూర ఖాన్డ్వి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach khandvi Recipe in Telugu )

  • పాలకూర - 2 కట్టలు
  • పచ్చిమిర్చి - 4
  • కొత్తిమీర - 5 రెమ్మలు
  • అల్లం - 1 అంగుళం ముక్క
  • శనగపిండి - 1 కప్పు
  • మజ్జిగ - 2 కప్పులు
  • ఉప్పు - తగినంత
  • నూనె - తగినంత
  • ఆవాలు - 1 స్పూన్
  • జీలకర్ర - 1 స్పూన్
  • నీరు - తగినంత
  • నువ్వులు - 1 స్పూన్
  • యండుమిర్చి - 5
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • కొబ్బరి - తగినంత

పాలకూర ఖాన్డ్వి | How to make Spinach khandvi Recipe in Telugu

  1. ముందుగా పాలకూర కడిగి ఉడికించి నీరు వడగట్టి పైనుండి చల్లనినీరు పోసి మిక్సర్ జార్ లో వేసి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నిలో శనగపిండి ,మజ్జిగ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారైన పాలకూర పేస్ట్ ని వడగట్టి శనగపిండి లో వేసి ఉప్పు కూడ వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి.
  3. ఉడికించే ముందు ఏదైనా నునుపుగా ఉన్న బండ పైన నూనె రాసి పెట్టుకోవాలి.
  4. ఒక కడాయి పెట్టి కలిపినా మిశ్రమాన్ని వేసి కలుపుతూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
  5. మిశ్రమం దగ్గర పడగానే నూనె రాసిన బండమీద వేసి అట్లకాడతో పల్చగా సమానంగా పరుచుకోవాలి.
  6. పైనుండి కొబ్బరి కొత్తిమీర చల్లుకోవాలి. .
  7. చల్లారిన తర్వాత ముందు మధ్యకు కట్ చేసి తర్వాత పొడవుగా 2 అంగుళాల గాప్ తో కట్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు ఒక్కక ముక్కని చివరినుండి మొదలుపెట్టి మద్య కట్ చేసిన వరకు రోల్ చేసుకోవాలి.
  9. అలా అన్ని ముక్కలు రోల్ చేసుకోని ప్లేట్ లో తీసుకోవాలి.
  10. ఇప్పుడు పోపు కడాయి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు ,జీలకర్ర ,నువ్వులు, యండుమిర్చి, కర్వేపాకు వేసుకోని చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  11. తయారైన పోపుని ఖాన్డ్వి పైనుండి వేసుకోవాలి పైన కొంచం కొత్తిమీర చల్లితే రుచికరమైన ఖాన్డ్వి రెడీ...

నా చిట్కా:

ఇష్టం ఉన్నవాళ్ళు పైనుండి పాచి కొబ్బరి తురుము వేస్కొవచ్చు.

Reviews for Spinach khandvi Recipe in Telugu (0)