హోమ్ / వంటకాలు / పాలకూర ఖాన్డ్వి

Photo of Spinach khandvi by Pravallika Srinivas at BetterButter
529
0
0.0(0)
0

పాలకూర ఖాన్డ్వి

Oct-16-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ఖాన్డ్వి రెసిపీ గురించి

ఖాన్డ్వి గుజరాతి వారి సాంప్రదాయ స్నాక్ .ఈ వంట తయారీకి ఫ్రెష్ గా ఉన్న శనగపిండి మరియు మజ్జిగతో చేస్తారు. నేను ఇందులో పాలకూర పేస్ట్ వేయడం వలన పాలకూర, అల్లం ఫ్లవర్ తో ఖాన్డ్వి సాఫ్ట్ గా పైన నువ్వులు ,జీలకర్ర, ఆవాలు తో క్రన్చిగా చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గుజరాత్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - 2 కట్టలు
  2. పచ్చిమిర్చి - 4
  3. కొత్తిమీర - 5 రెమ్మలు
  4. అల్లం - 1 అంగుళం ముక్క
  5. శనగపిండి - 1 కప్పు
  6. మజ్జిగ - 2 కప్పులు
  7. ఉప్పు - తగినంత
  8. నూనె - తగినంత
  9. ఆవాలు - 1 స్పూన్
  10. జీలకర్ర - 1 స్పూన్
  11. నీరు - తగినంత
  12. నువ్వులు - 1 స్పూన్
  13. యండుమిర్చి - 5
  14. కర్వేపాకు - 1 రెమ్మ
  15. కొబ్బరి - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి ఉడికించి నీరు వడగట్టి పైనుండి చల్లనినీరు పోసి మిక్సర్ జార్ లో వేసి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నిలో శనగపిండి ,మజ్జిగ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారైన పాలకూర పేస్ట్ ని వడగట్టి శనగపిండి లో వేసి ఉప్పు కూడ వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి.
  3. ఉడికించే ముందు ఏదైనా నునుపుగా ఉన్న బండ పైన నూనె రాసి పెట్టుకోవాలి.
  4. ఒక కడాయి పెట్టి కలిపినా మిశ్రమాన్ని వేసి కలుపుతూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
  5. మిశ్రమం దగ్గర పడగానే నూనె రాసిన బండమీద వేసి అట్లకాడతో పల్చగా సమానంగా పరుచుకోవాలి.
  6. పైనుండి కొబ్బరి కొత్తిమీర చల్లుకోవాలి. .
  7. చల్లారిన తర్వాత ముందు మధ్యకు కట్ చేసి తర్వాత పొడవుగా 2 అంగుళాల గాప్ తో కట్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు ఒక్కక ముక్కని చివరినుండి మొదలుపెట్టి మద్య కట్ చేసిన వరకు రోల్ చేసుకోవాలి.
  9. అలా అన్ని ముక్కలు రోల్ చేసుకోని ప్లేట్ లో తీసుకోవాలి.
  10. ఇప్పుడు పోపు కడాయి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు ,జీలకర్ర ,నువ్వులు, యండుమిర్చి, కర్వేపాకు వేసుకోని చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  11. తయారైన పోపుని ఖాన్డ్వి పైనుండి వేసుకోవాలి పైన కొంచం కొత్తిమీర చల్లితే రుచికరమైన ఖాన్డ్వి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర