పాలకూర మినప గారెలు | Spinach Urad vada Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  17th Oct 2018  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach Urad vada recipe in Telugu,పాలకూర మినప గారెలు, Anitha Rani
పాలకూర మినప గారెలుby Anitha Rani
 • తయారీకి సమయం

  4

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

2

పాలకూర మినప గారెలు వంటకం

పాలకూర మినప గారెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach Urad vada Recipe in Telugu )

 • మినపప్పు.....100గ్రా
 • బియ్యము...2స్పూన్స్
 • పచ్చిమిర్చి...6
 • పాలకూర...1 కట్ట
 • అల్లము...చిన్న ముక్క
 • మిరియాలపొడి..1 స్పూన్
 • ఉప్పు...తగినంత
 • నూనె...150 గ్రా
 • వంట షోడా పొడి...చిటికెడు

పాలకూర మినప గారెలు | How to make Spinach Urad vada Recipe in Telugu

 1. మినపప్పు ను 4 గంటలు నాన బెట్టాలి.
 2. మినపప్పు,పచ్చిమిర్చి,అల్లము కలిపి మిక్సీ కి కానీ గ్రైండర్ కు కానీ వేసుకోవాలి.
 3. పాలకూర ఉప్పు నీటి లో కడగాలి
 4. వేడి నీటి లో పాల కూర ముంచి తీయాలి.
 5. ముందుగా రుబ్బుకున్న పిండి లో పాల కూర నీరు లేకుండా వేసి మిక్సీ కి వీసుకోవాలు
 6. పిండి ఈ విధముగా వస్తుంది.అందులో ఉప్పు,చిటికెడు వంట సోడా పొడి,మిరియాల పొడి వేసి కలుపు కోవాలి.
 7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి చేతికి తడి అద్దు కొని నూనె లో వీసుకోవాలి.
 8. నూనె లో చిన్న మంటపైన కాలనివ్వాలి.
 9. రెండువైపులా వేగా క తీయాలి.
 10. ఈ విధముగా కరకర లాడే పాలకూర గారెలు తయారు.

నా చిట్కా:

పాలకూర వేడి నీటి లో ఉంచినప్పుడు మూత పెట్టకూడదు.పెడితే రంగు మారుతుంది.

Reviews for Spinach Urad vada Recipe in Telugu (2)

Vamsidhar Reddy6 months ago

Wowww super. I tried this recipe it’s tasty :ok_hand::ok_hand::heart_eyes:
జవాబు వ్రాయండి

Sriram Naga6 months ago

గారెలు perfect గా వచ్చాయి.
జవాబు వ్రాయండి