హోమ్ / వంటకాలు / మేథీ ఆలూ పూరి

Photo of Fenugreek potato poori by Pravallika Srinivas at BetterButter
562
0
0.0(0)
0

మేథీ ఆలూ పూరి

Oct-17-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ ఆలూ పూరి రెసిపీ గురించి

మేథీ ఆలూ పూరి ఒక రుచికరమైన అల్పాహారం. మెంతికూర మధుమేహంని కంట్రోల్ లో ఉంచుతుంది . అంతే కాదు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆలూ వలన కార్బోహైడ్రేట్స్ అందుతాయి. మెంతికూర కొంచం చేదు ఉండటం వలన పిల్లలు తినటానికి ఇష్టపడరు. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ - 2
  2. మెంతికూర - 1 కప్పు
  3. గోధుమ పిండి - 250 గ్రా
  4. ఉప్పు - 1 స్పూన్
  5. కారం - 1 స్పూన్
  6. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  7. వాము - 1 టేబుల్ స్పూన్
  8. నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  9. పసుపు - 1/4 స్పూన్
  10. నీరు - తగినంత
  11. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా ఆలూ ని కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయేలోపు ఒక బేసన్స్లో గోధుమ పిండి, ఉప్పు ,కారం ,జీలకర్ర ,వాము,నువ్వులు,పసుపు, కడిగి పెట్టిన మెంతికూర వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఆలూని పొట్టు తీసి బేసిన్ లో తురుముకోవాలి.
  3. ఇప్పుడు మొత్తం ఒకసారికలిపి పైనుండి అవసరమైనంత నీరు పోస్తూ పూరి ముద్దను చేస్కుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  4. తయారైన ముద్దను సమాన భాగాలుగా చేసుకోవాలి.
  5. ఒకొక్క ముద్దని తీస్కొని పూరి వత్తుకోవాలి.
  6. ఆలా అన్నింటిని చేసుకొని నూనెలో డీఫ్రై చేసుకోవాలి.
  7. అంతే రుచికరమైన మేతి ఆలూ పూరి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర