వెజ్ పాలక్ పాస్తా | Vegetable spinach pasta Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vegetable spinach pasta  recipe in Telugu,వెజ్ పాలక్ పాస్తా, రమ్య వూటుకూరి
వెజ్ పాలక్ పాస్తాby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

వెజ్ పాలక్ పాస్తా వంటకం

వెజ్ పాలక్ పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable spinach pasta Recipe in Telugu )

  • పాస్తా 2 కప్స్
  • పాలకూర 2 కట్టలు
  • కేరట్ 2
  • క్యాప్సికమ్ 2
  • ఉల్లిపాయ 1
  • పుదీనా కొంచం
  • ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • మిరియాలపొడి 1/2 టేబుల్ స్పూన్
  • టొమోటో సాస్ 2 స్పూన్స్
  • వినిగర్ 1 స్పూన్
  • సొయా సాస్ 1 స్పూన్
  • ఎగ్ లెస్ మయో 5 స్పూన్స్
  • మిక్స్డ్ హెర్బ్ 1/4 స్పూన్

వెజ్ పాలక్ పాస్తా | How to make Vegetable spinach pasta Recipe in Telugu

  1. వాటర్ లో ఉప్పు ఆయిల్ వేసి పాస్తా బాగా ఉడికించాలి
  2. ఉడికిన తర్వాత వాటర్ వార్చి చక్కర్చుకోవాలి
  3. పాలకూర ఉడికించి చల్లార్చి పుదీనా తో కలిపి పేస్ట్ చేసుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చెయ్యాలి
  5. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి పెద్ద మంట పై వేయించాలి. ముక్కలు మెత్తగా కాకూడదు
  6. తర్వాత పాస్తా కూడా వేసి వేయించాలి
  7. ఇప్పుడు టొమోటో సాస్ సొయా సాస్ వెనిగర్ మాయో సాస్ పాలక్ పేస్ట్ వేసి కలపాలి
  8. 2 మినిట్స్ వేగిన తర్వాత సాల్ట్ మిరియాలపొడి మిక్స్ హెర్బ్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

ఆకుకూరలతో వంట చేసేప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆకుకూరల్లో కొంచం ఉప్పు ఉంటుంది

Reviews for Vegetable spinach pasta Recipe in Telugu (0)