పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ | Spinach cup cake with vanilla frosting Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach cup cake with vanilla frosting  recipe in Telugu,పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ , Divya Konduri
పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ by Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Spinach cup cake with vanilla frosting Recipe in Telugu

పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ వంటకం

పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach cup cake with vanilla frosting Recipe in Telugu )

  • బటర్ 100గ్రామలు
  • విప్ క్రీమ్ 50గ్రాములు
  • షుగర్ పౌడరు 150గ్రములు
  • పాలకూర పేష్టు 100గ్రాములు
  • బేకింగ్ సోడ ఒక టీ స్పూను
  • బేకింగ్ పౌడరు ఒక టీ స్పూను
  • పాలు 50గ్రాములు
  • కండెన్స్ మిల్క్ 50గ్రాములు
  • మైదా పిండి 150గ్రాములు
  • వెన్నీల ఎసెన్సు 3 చుక్కలు
  • పైన ఫ్రాస్టింగ్ కి :
  • విప్ క్రీమ్ 50గ్రాములు
  • షుగర్ పౌడరు 100గ్రాములు
  • వెన్నీల ఎసెన్సు 3చుక్కలు
  • చెర్రీ అలంకరణకు

పాలకూర కప్ కేక్ , వెన్నీల ఫ్రాస్టింగ్ | How to make Spinach cup cake with vanilla frosting Recipe in Telugu

  1. ముందుగా పాలకూరని శుబ్రం చేసి వేడి నీటిలో వేసి తీసి
  2. మెత్తగా పేస్టు చేయాలి
  3. ఇంకో గిన్నెలో బటర్.కండెన్స్ మిల్కు.విప్ క్రీమ్ .పాలు.షుగర్ పౌడరు వేసి బీటు చేయాలి
  4. పాలకూర పేస్టులో బేకింగ్ పౌడరు.సోడ వేసి కలిపి పర్పోస్ ఫ్లోర్ కూడ వేసి కలపాలి
  5. ఈ పాలకూర మిశ్రమాన్ని ముందు చేసిన క్రీమ్ మిశ్రమం కలిపి మళ్ళీ బీటు చేయాలి
  6. వెన్నీల యస్న్స్ కలిపి 5 నిమిషాలు బీటు చేయాలి
  7. ఇలా చేసాక కప్ కేకుల మౌల్డు తీసుకొని బటరు పూసి అందులో కలిపిన పిండి వేయాలి
  8. 180 డిగ్రీల వద్ద 15నిమిషాలు బేక్ చేయాలి
  9. టూత్ పిక్ తో పొడిచి టెస్టు చేయాలి
  10. ఫ్రోస్టింగ్ కోసం...ఒక గిన్నె లో విప్ క్రీమ్.షుగర్ పౌడరు.వెన్నీల యస్న్స్ వేసి బీటు చేసి
  11. కప్ కేకుల పైన వేసి చెర్రీ..స్పి్ర్కెంల్స్ తో అలంకరించాలి

నా చిట్కా:

బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండేటట్టు చూడాలి

Reviews for Spinach cup cake with vanilla frosting Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo