స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్ | Stuffed Spinach Rolls Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  17th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Stuffed Spinach Rolls recipe in Telugu,స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్, Sudha Badam
స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్by Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

1

స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్ వంటకం

స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed Spinach Rolls Recipe in Telugu )

  • పాలకూర 1 కట్ట
  • గోధుమ పిండి 1 కప్పు
  • పచ్చిమిర్చి 3
  • క్యారెట్ 1
  • ఉల్లిపాయ 1
  • గ్రీన్ క్యాప్సికమ్ 1 పెద్దది
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉప్పు
  • పెప్పర్
  • టమాటా సాస్
  • మయోనిస్
  • చిల్లి ఫ్లేక్స్

స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్ | How to make Stuffed Spinach Rolls Recipe in Telugu

  1. పాలకూర కడిగి మిక్సీలో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకోవాలి.
  2. బౌల్ లో గోధుమ పిండి వేసుకుని దానిని పాలకూర పేస్ట్ తో చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. Stuffing కోసం క్యారెట్ ని సన్నగా తురుముకోవాలి.ఉల్లిపాయ క్యాప్సికమ్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  4. పాన్ లో ఒక స్పూన్ నూనె వేసుకుని వేడెక్కాక తరిగిన ముక్కల్ని ఒక దాని తరువాత ఒకటి వేసుకుంటూ వేగనిచ్చి ఉప్పు, పెప్పర్, టమాటా సాస్ వేసి కలుపుకుని స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలి.
  5. రెండు స్పూన్ల మయోనిస్ ని చిన్న గిన్నీలో తీసుకుని దానిలో చిల్లి ఫ్లేక్స్ కలుపుకుని ఉంచుకోవాలి.
  6. కలుపుకున్న పిండితో చపాతీలా పాముకుని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
  7. కాలిన చపాతిని ఒక ప్లేట్ లోకి తీసుకుని దాని మీద మయోనిస్ మిశ్రమాన్ని పూసి దానిలో తయారుచేసుకున్న కూరని పెట్టి చపాతీని టైట్ గా రోల్ చేసుకోవాలి.
  8. వాటిని అంగుళం ముక్కలు కింద కట్ చేసుకోవాలి.అంతే స్టఫ్ఫ్డ్ పాలక్ రోల్స్ రెడి అయినట్టే.
  9. ఇలా సర్వ్ చేసుకోవాలి.

Reviews for Stuffed Spinach Rolls Recipe in Telugu (1)

Sravanti a month ago

జవాబు వ్రాయండి