హోమ్ / వంటకాలు / పాలకూర పకోడ కడీ.

Photo of Spinach pakoda kadhi  by Chandrika Marripudi at BetterButter
0
0
0(0)
0

పాలకూర పకోడ కడీ.

Oct-17-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పకోడ కడీ. రెసిపీ గురించి

పాలకూర పకోడ కడీ ఒక గుజరాతి వంటకం.పాలకూరతో పకోడాలు చేసి పెరుగుతో చేసిన గ్రేవీలో ఉడికించాలి. సాధారణంగా పకోడీలకి శనగపిండి వాడుతారు.ఇక్కడ నేను మల్టీగ్రైన్ ఆటా వేసి చేశాను.శనగపిండి పడనివాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇది అన్నం,చపాతీలలో ఇంకా స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • చిలకడం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పకోడీల కోసం
  2. పాలకూర : 2 కట్టలు
  3. మల్టీగ్రైన్ ఆటా : 1 కప్పు
  4. ఉల్లిపాయలు : 3
  5. పచ్చిమిర్చి :8
  6. అల్లం : ఒక అంగుళం ముక్క
  7. జీలకర్ర : 2 స్పూన్లు
  8. ఉప్పు : తగినంత
  9. నూనె : డీప్ ఫ్రై కి సరిపడ
  10. కడీ కోసం
  11. పుల్లటి పెరుగు : 1 కప్పు
  12. శనగపిండి : 2 స్పూన్లు
  13. ఉప్పు : తగినంత
  14. కారం : 1 స్పూను
  15. ఆవాలు : 1 స్పూను
  16. జీలకర్ర : 1 స్పూను
  17. మెంతులు : 1/4 స్పూన్
  18. ఎండుమిర్చి : 2
  19. కరివేపాకు : 2రెమ్మలు
  20. నూనె : 2 స్పూన్లు
  21. పసుపు : 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
  2. అందులో తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ,తగినంత ఉప్పు, జీలకర్ర,2 స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి.
  3. ఇలా కలపడం వల్ల పాలకూర నుండి నీరు బయటకి వచ్చి పిండి కలిపేటపుడు నీళ్ళు పోసే అవసరం తక్కువ. పకోడీలు కూడా రుచిగా ఉంటాయి.
  4. ఇపుడు పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి
  5. కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి పెట్టుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పోసి వేడయ్యాక బాల్స్ ని వేసి మీడియం మంటలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  7. పెరుగును ఒక గిన్నెలో వేసి శనగపిండి, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి ఉండల్లేకుండా.
  8. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి
  9. కలిపిన పెరుగు మిశ్రమాన్ని పోపులో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఒక మరుగు వచ్చేవరకు ఉడికించాలి.
  10. ఇపుడు వేయించుకున్న పకోడాలను పెరుగులో వేసి ఒక నిమిషం ఉడికించి వడ్డించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర