హోమ్ / వంటకాలు / ముల్లంగి ఆకుతో పప్పు

Photo of Daal with Radish leaf by Shobha.. Vrudhulla at BetterButter
438
0
0.0(0)
0

ముల్లంగి ఆకుతో పప్పు

Oct-17-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి ఆకుతో పప్పు రెసిపీ గురించి

ముల్లంగి మరియు దాని ఆకులు చాలా పౌష్టికమయిన ఆహారం. ఈ ఆకులతో పచ్చడి,పప్పు మరియు కూర కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్లంగి ఆకు తరిగినది రెండు కప్పులు
  2. కంది పప్పు అర కప్పు
  3. పెసరపప్పు అర కప్పు
  4. ఉల్లిపాయలు ఒకటి
  5. పచ్చిమిర్చి రెండు
  6. ఎండు మిర్చి రెండు
  7. వెల్లుల్లి ఒలిచినవి ఒక పది.
  8. కరివే పాకు ఒక రెమ్మ
  9. అవాలు ఒక చెంచా
  10. జీలకర్ర ఒక చెంచా
  11. ఇంగువ మూడు చిటికెలు
  12. టమాటలు రెండు
  13. నూనె మూడు చంచాలు
  14. ఉప్పు తగినంత
  15. పసుపు ఒక చిన్న చంచాడు
  16. కారము పొడి ఒక చెంచా
  17. ధనియాల పొడి ఒక చెంచా
  18. జీలకర్ర పొడి ఆర చెంచా
  19. నిమ్మకాయలు రెండు, రసం తీసి పెట్టుకోవలెను

సూచనలు

  1. ముందుగా ఒక గంట వరకు పప్పులు రెండు బాగా కడిగి ననపెట్టుకోవలెను
  2. టమాటాలు రుబ్బి ముద్ద చేసి పెట్టుకోవలెను
  3. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి ఉంచాలి
  4. అలాగే పచ్చిమిర్చి కూడా నిలువుగా తగిగి ఉంచాలి
  5. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  6. ఇప్పుడు రెండు పప్పులు కలిపీ కుక్కర్ లో వేసి ఉడికించి తీయాలి బాగా మెత్తగా ఉండాలి
  7. ఇప్పుడు ఒక ముకుడులో ముల్లంగి ఆకు వేసి కొంచెం నీరు పోసి ఉడకనివ్వండి .
  8. ఆకు కుక్కర్ లో ఉడికిస్తే రుచి ఉండదు బలం కూడా ఉండదు.
  9. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దానిలో నూనె వేసి కాగనివ్వాలి .
  10. కాగిన నూనెలో అవాలు , జీలకర్ర , ఇంగువ వేసి పోపు పెట్టాలి
  11. అవి వేగాక ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించలి.
  12. ఇందులో పచ్చిమిర్చి ,ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి
  13. అన్ని వేగాక టమాట ముద్ద వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి.
  14. వేగిన తరువాత వరుసగా ఉప్పు,పసుపు,కారము,ధనియాల పొడి,జీలకర్ర పొడి అన్ని వేసి ఒక్క నిమిషం వేగనివ్వాలి.
  15. ఇప్పుడు అందులో పప్పు మరియు ఉడికిన ముల్లంగి ఆకు కూడా వేసి నీళ్లు పోయవలెను.మనకు పల్చగా పప్పు నచ్చితే కాస్త ఎక్కువగా నీళ్లు పోయవచ్చు లేకపోతే చూసుకొని మరీ ముద్దగా కాకుండా కాస్త నీళ్లు పోయవచ్చు .
  16. అన్ని వేసి బాగా కలిపి స్టౌవ్ తగ్గించి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి
  17. అన్ని కలిసి ఉడుకుతూ ఉన్నప్పుడు నిమ్మకాయ రసాన్ని వేసుకోండి . నిమ్మకాయ వేయటం వల్ల పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.
  18. అన్ని అయ్యాక మూకుడు దించి ఒక గిన్నెలో తీసి మీదనుంచి కొత్తిమీర వేసుకుంటే మరీ బాగుంటుంది. అంతే ఎంతో రుచికరమయిన ముల్లంగి ఆకుతో పప్పు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర