హోమ్ / వంటకాలు / తోటకూర మసాలా వడ.

Photo of Amaranth leaves masala vada by Chandrika Marripudi at BetterButter
438
0
0.0(0)
0

తోటకూర మసాలా వడ.

Oct-18-2018
Chandrika Marripudi
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర మసాలా వడ. రెసిపీ గురించి

పెసరపప్పు, శనగపప్పు నానపెట్టి రబ్బి తోటకూర వేసి చేసుకునే వడలు.జొన్నపిండి లేదా బియ్యప్పిండి కూడా కలుపుకోవచ్చు ముద్దగా అవడానికి.కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు : 2 కప్పులు
  2. పచ్చిశనగపప్పు : 1 కప్
  3. తోటకూర : 2 కట్టలు
  4. జొన్నపిండి : 1కప్
  5. ఉల్లిపాయ : 1
  6. పచ్చిమిర్చి : 6
  7. అల్లం : చిన్న ముక్క
  8. జీలకర్ర : 2 స్పూన్లు
  9. ఉప్పు : తగినంత
  10. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. పెసరపప్పు, శనగపప్పు రెండు గంటలు నానపెట్టుకోవాలి
  2. తరువాత కడిగి నీళ్లు వంపేసి మిక్సీజార్లో వేసి అల్లం,పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా.
  3. ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి.
  4. తోటకూర శుభ్రం చేసి బాగా కడిగి సన్నగా తరగాలి.
  5. తరిగిన తోటకూర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు పిండోలో వేసి జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి ముద్దగా కలుపుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె పోసి వేడయ్యాక పిండిని వడల్లా వత్తుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  7. అంతే కరకరలాడే వడలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర