హోమ్ / వంటకాలు / కొత్తిమీర పుదీనా ఆలూ మెఫిన్స్

Photo of Coriander mint aloo muffins by Sree Sadhu at BetterButter
486
1
0.0(0)
0

కొత్తిమీర పుదీనా ఆలూ మెఫిన్స్

Oct-18-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పుదీనా ఆలూ మెఫిన్స్ రెసిపీ గురించి

స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చాక తినటానికి బాగుండే చిరుతిండి . చాలా రుచికరంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. సూజి రవ్వ 1/2 కప్
  2. కొత్తిమీర 1 కట్ట
  3. మైదా 2 చెంచాలు
  4. పెరుగు 1/2 కప్
  5. బట్టర్ 1 చెంచా
  6. బంగాళదుంప స్లైసెస్ 1 కప్
  7. మిక్సడ్ హెర్బస్ 2 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  10. ఛీజ్ తురుము 1/2 కప్
  11. పచ్చిమిర్చి 2
  12. పుదీనా 1 కట్ట

సూచనలు

  1. ముందుగా ఆలూ ని సన్నగా స్లైసెస్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గాజు గిన్నె తీసుకుని అందులో సూజి రవ్వ, మైదా, ఉప్పు ,అల్లం వెల్లులి పేస్ట్ ,నూనె ,,పెరుగు, మిక్సడ్ హెర్బస్ ,ఉప్పు ,కారం ,ఛీజ్, నూనె వేసి బజ్జి పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు ముఫిన్ మౌల్డ్ తీసుకుని కింద నూనె రాసుకోవాలి
  4. దాని మీద స్లైస్ చేసి ఆలూ 3-4 పెట్టాలి
  5. దాని మీద పుదీనా కొత్తిమీర పేస్ట్ పెట్టాలి
  6. దాని మీద 3-4 చెంచాల సూజి మిశ్రమం వెయ్యాలి
  7. దాని మీద ఛీజ్ పచ్చిమిర్చి వేసుకోవాలి
  8. అదే ప్రొసెస్ మౌల్డ్ నిండే వరకు చేయాలి
  9. లాస్ట్ లేయర్ లో ఆలూ ఛీజ్ వేసుకోవాలి
  10. అలాగే మిగతావి కూడా చేసుకోవాలి
  11. ఇప్పుడు ఒవేన్ ఆన్ చేసుకొని ప్రి హీట్ చేసుకోవాలి
  12. ఇప్పుడు దానిని ఒవేన్ లో పెట్టి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి
  13. తరువాత ఒవేన్ నుంచి బయటికి తీసుకోవాలి దానిని చల్లరిన తరువాత మెఫిన్ మౌల్డ్ నుంచి తీసేసుకొని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర