హోమ్ / వంటకాలు / హర్యాలి పన్నీరు కుర్మ

Photo of Haryali paneer  kurma by Divya Konduri at BetterButter
566
1
0.0(0)
0

హర్యాలి పన్నీరు కుర్మ

Oct-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హర్యాలి పన్నీరు కుర్మ రెసిపీ గురించి

హర్యాలి అనగానే ఆకుకూరలతో తయారు చేస్తారు.అందులో పన్నీరు వేసి చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర కట్ట ఒకటి
  2. ఫ్రైష్ క్రీమ్ 2 స్పూనులు
  3. జీడి పప్పు పావు కప్పు
  4. కొత్తిమీర ఒక కప్పు
  5. తోటకూర కప్పు
  6. బటర్ 50గ్రాములు
  7. పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూన్
  8. దనియాల పొడి ఒక స్పూను
  9. పసుపు పావు స్పూను
  10. పన్నీరు ముక్కలు 100గ్రాములు
  11. కసూరి మేతి ఒక స్పూను
  12. వేగించిన ఉల్లి తరుగు 1 కప్పు
  13. ఉప్పు తగినంత
  14. అల్లం తరుగు

సూచనలు

  1. ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేసి పాలకూరను , తోటకూరను విడి విడి గా వేసి ఒక నిమిషం ఉడికించి , కాస్త చల్లార్చుకొని కొత్తిమీర కూడా వేసుకొని పేస్టు చేసుకోవాలి
  2. బాండీ పెట్టి బటర్ వేసి అల్లం తరుగు వేసి వేయించి రుబ్బుకున్న ఆకుకూరల పేస్టు వేసుకొని నూనె చుక్కలు పైకి తేలే వరకు చిన్న మంట మీద ఉడికించాలి
  3. ఆ తరువాత ధనియాల పొడి,జీలకర్ర పొడి, పచ్చిమిర్చి వేసి వేగించి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి
  4. బాగా కలుపుకొని ఒక నిమిషం ఉడికించి పనీర్ ముక్కలు వేసుకోండి .
  5. మూత యాటవాలుగా పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించి , బరకగా నలిపిన కసూరి మేతి మరియు క్రీం వేసుకొని కలుపుకోండి
  6. దగ్గర పడ్డాక వేగించిన ఉల్లి తరుగు వేసి తరిగిన కొత్తిమీర,జీడి పప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర