హోమ్ / వంటకాలు / ముల్లంగి ఆకు సజ్జ కడాయి అప్ప

Photo of Radish leaves pearlmillet roti by Pravallika Srinivas at BetterButter
417
0
0.0(0)
0

ముల్లంగి ఆకు సజ్జ కడాయి అప్ప

Oct-19-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి ఆకు సజ్జ కడాయి అప్ప రెసిపీ గురించి

ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎదిగే పిల్లలకు సజ్జలు మంచి ఔషధంలా పని చేస్తాయి. పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి.ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్లంగి ఆకుని సజ్జ పిండి తో కలిపి చేసే ఆరోగ్యమైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. సజ్జపిండి - 250 గ్రా
  2. ముల్లంగి ఆకులు - 1 కట్ట
  3. పెసరపప్పు - 3 టేబుల్ స్పూన్
  4. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  5. పచ్చిమిర్చి - 6
  6. ఉప్పు - 1 స్పూన్
  7. ఉల్లితరుగు - 1
  8. నీరు - తగినంత
  9. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా పెసరపప్పును నానపెట్టుకోవాలి. ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి.ముల్లంగి ఆకులను కట్ చేసి కడిగి పెట్టుకోవాలి .
  2. ఒక బేసన్ తీస్కొని సజ్జపిండి , తరిగిన ముల్లంగి ఆకులు , ఉల్లితరుగు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ ,జీలకర్ర, నానపెట్టిన పెసరపప్పు వేసుకోవాలి.
  3. ఇప్పుడు అన్ని కలిపి పైనుండి నీరు పోసి చపాతీ పిండి లాగ కలుపుకోవాలి.
  4. కాలాయి తీస్కుని నూనె వేసి కొంచం పెద్ద పిండి ముద్దను తీస్కుని కాలాయికి వత్తుకుని రంద్రాలు పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు స్టవ్ వెలిగించి పిండిని వత్తుకున్న కాలాయి పెట్టి మూత పెట్టుకుని సన్న మంట పైన ఎర్రగా కాల్చుకోవాలి.
  6. మూత పెట్టడం వలన రెండోవైపు కాల్చక్కర్లేదు.అంతే రుచికరమైన ముల్లంగి ఆకు సజ్జ కాలాయి అప్ప రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర