హోమ్ / వంటకాలు / తోటకూర పెసరపప్పు వేపుడు

Photo of Amaranthus moongdal fry by రమ్య వూటుకూరి at BetterButter
415
0
0.0(0)
0

తోటకూర పెసరపప్పు వేపుడు

Oct-19-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పెసరపప్పు వేపుడు రెసిపీ గురించి

చపాతీ మరియు అన్నం లోకి బాగుంటుంది. చాలా ఈజీ గా చేస్కోవచ్చు. టేస్టీ రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 3 కట్టలు
  2. పెసరపప్పు 1 కప్
  3. పోపుగింజలు 2 స్పూన్స్
  4. ఆయిల్ 2 స్పూన్స్
  5. వెల్లుల్లి 10 రెబ్బలు
  6. ఎండుమిర్చి 6
  7. ఇంగువ కొంచెం
  8. ఉప్పు తగినంత
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. తోటకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. పెసరపప్పు కడిగి అరగంట నానబెట్టుకోవాలి
  3. వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలచి పెట్టుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి
  5. ఆయిల్ లో పోపుగింజలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి
  6. పోపు వేగాక తోటకూర ముక్కలు పెసరపప్పు వేసి 2 నిముషాలు వేయించాలి
  7. తర్వాత 1/2 కప్ నీళ్లు పోసి మూతపెట్టుకొని ఉడికించాలి
  8. పెసరపప్పు ఉడికాక ఉప్పు పసుపు వేసి కలిపి 1 మినిట్ ఫ్రై చేయాలి
  9. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర