హోమ్ / వంటకాలు / తమలపాకు బజ్జి చాట్

Photo of Betel leaf Fritter Chat by Pravallika Srinivas at BetterButter
409
1
0.0(0)
0

తమలపాకు బజ్జి చాట్

Oct-19-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు బజ్జి చాట్ రెసిపీ గురించి

తమలపాకు సాధారణంగా తాంబూలం కి లేదా కిల్లిలో వేసుకుంటాం. దేవుడు దగ్గర తాంబూలంలా తోరణాలలో ఇలా అనేకరకాలుగా శుభకార్యాలలో వాడతాం కానీ వాటిని వంట లో వాడటం తక్కువ . తమలపాకులలో కాల్షియమ్ ఎక్కువ ఉంటుంది. మంచి రుచికరమైన భోజనం చేసాక తమలపాకులు వేసుకోవడం వలన అరుగుదల సమస్యలు రావు.బాలింతలు భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం వలన మల్లి తిరిగి కాల్షియమ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న తమలపాకులతో బజ్జి చేసి దానితో చాట్ చేయడం ఎలాగో చూదామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. తమలపాకులు - 10
  2. శనగపిండి - 1 కప్పు
  3. బియ్యం పిండి- 1 కప్పు
  4. ఉప్పు - తగినంత
  5. వాము - 1/4 స్పూన్
  6. నీరు - తగినంత
  7. నూనె - తగినంత
  8. ఉల్లిపాయ - 1
  9. టమాటో - 1
  10. కొత్తిమీర - తగినంత
  11. దానిమ్మగింజలు - తగినంత
  12. కారపూస - తగినంత
  13. కారం - తగినంత
  14. గరం మసాలా - తగినంత
  15. చాట్ మసాలా - తగినంత
  16. ఆంచూర్ పొడి - తగినంత

సూచనలు

  1. ముందుగా తమలపాకులను కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక బేసన్ లో శనగపిండి ,బియ్యం పిండి, ఉప్పు ,వాము ,నీరు వేసి బజ్జి పిండిలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి కాగాక కడిగిన తమలపాకులను శనగపిండిలో ముంచి నూనె లో వేసుకోవాలి.
  4. రెండువైపులా కాలిస్తే తమలపాకుల బజ్జిలు రెడీ.
  5. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. దానిమ్మగింజలు వలిచి పెట్టుకోవాలి.
  6. తయారైన బజ్జిలను ప్లేట్లో తీస్కుని పైనుండి తరిగిన ఉల్లిపాయలు టమాటో ముక్కలు, కొత్తిమీర, దానిమ్మగింజలు వేసుకోవాలి. ఇంకా కారపూసను కూడా చల్లుకోవాలి. పైనుండి ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా ,ఆంచూర్ పొడి అన్ని చల్లుకోవాలి.
  7. అంతే రుచికరమైన తమలపాకు బజ్జి చాట్ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర