హోమ్ / వంటకాలు / మెంతికూర పులిహోర

Photo of Fenugeek leaves tamarind rice by Pravallika Srinivas at BetterButter
475
1
0.0(0)
0

మెంతికూర పులిహోర

Oct-19-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర పులిహోర రెసిపీ గురించి

మెంతికూర మధుమేహంని కంట్రోల్ లో ఉంచుతుంది . అంతే కాదు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆలూ వలన కార్బోహైడ్రేట్స్ అందుతాయి. మెంతికూర కొంచం చేదు ఉండటం వలన పిల్లలు తినటానికి ఇష్టపడరు. మెంతికూర పులిహోర లో చింతపండు లోని పులుపు వలన చేదు తెలియదు కాబట్టి ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతికూర - 1 కట్ట
  2. బియ్యం - 3 కప్పులు
  3. చింతపండు - నిమ్మకాయ అంత
  4. వేరుశనగ గుండ్లు - 2 టేబుల్ స్పూన్లు
  5. పచ్చిపప్పు - 1 టేబుల్ స్పూన్
  6. మినపప్పు - 1 టేబుల్ స్పూన్
  7. జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
  8. ఆవాలు - 1/2 టేబుల్ స్పూన్
  9. పచ్చిమిర్చి - 10
  10. ఇంగువ - 1/4 స్పూన్
  11. ఉప్పు - తగినంత
  12. పసుపు - 1/4 స్పూన్
  13. యండుమిర్చి - 6
  14. కర్వేపాకు - 2 రెమ్మలు
  15. బెల్లం - 1 టేబుల్ స్పూన్
  16. నూనె - 4 టేబుల్ స్పూన్
  17. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా మెంతికూర గిల్లి కడిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి అన్నాన్ని పొడి పొడిగా సిద్ధం చేసుకోవాలి. చింతపండును వేడి నీటిలో నానపెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగాక వేరుశనగ గుండ్లు ,పచ్చిపప్పు, మినపప్పు ,జీలకర్ర, ఆవాలు ,పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ, ఉప్పు, పసుపు, యండుమిర్చి ,కర్వేపాకు వేసి చిటపటలాడాక మెంతికూర వేసి మగ్గనివ్వాలి. చింతపండు పులుసు బెల్లం వేసి దగ్గరగా ఉడికితే పులిహోర పోపు రెడీ.
  3. ఇప్పుడు ముందుగా ఉడికించిన అన్నం వేసి తగినంత పైఉప్పు వేసి కలుపుకుంటే వేడి వేడి మెంతికూర పులిహోర రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర