హోమ్ / వంటకాలు / మేథీ జైపూరీ

Photo of METHI JAIPURI by Rashmi SudhiMurthy at BetterButter
462
0
0.0(0)
0

మేథీ జైపూరీ

Oct-20-2018
Rashmi SudhiMurthy
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ జైపూరీ రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యకరమైన కర్రీ.మెంతాకులు మరియు శెనగ పిండి తో చేసి చపాతీ లోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • రాజస్థాన్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మేథిఆకుకూర 2కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 2కప్పులు
  3. టమాటో ముక్కలు 1కప్
  4. వెల్లుల్లి రెబ్బలు 15
  5. అల్లం 1చిన్న ముక్క
  6. బాదం పప్పులు 5
  7. శెనగపిండి 1 & 1/2 కప్
  8. నీళ్లు 4 కప్పులు
  9. పచ్చిమిర్చి 2
  10. కారం పొడి 2 టేబుల్ స్పూన్లు
  11. కరివేపాకు 10
  12. కొత్తిమీర 1/4 కప్
  13. పసుపు 1/4 టీ స్పూన్
  14. ఉప్పు రుచికి సరి పడ
  15. షాహీ జీరా 1 టీ స్పూన్
  16. గరం మసాలా 2 టీ స్పూన్లు
  17. కసూరీమేథీ 1టీ స్పూన్
  18. నూనె 1/4 కప్

సూచనలు

  1. ముందుగా మేథి ఆకులను శుభ్రపరుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి
  2. అందులో శెనగపిండి ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి
  3. ఆకుకూర ముద్దని రోల్స్ చేసి పెట్టుకోవాలి.
  4. ఒక గిన్నెలో నీళ్ళు పోసి అవి మరిగాక అందులో రోల్స్ వేసి ఉడకనివ్వాలి
  5. అవి ఉడికిన తరువాత రోల్స్ తీసి చిన్న కోఫ్తా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి
  6. రోల్స్ చేసిన నీళ్లని గ్రేవీ లో వాడడానికి తీసిపెట్టుకోవాలి
  7. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నూనె వేసి గ్రేవీ కోసం 1కప్ ఉల్లిపాయముక్కలు,టమాటో ముక్కలు,అల్లం,వెల్లుల్లి రెబ్బలు,బాదం పప్పులు కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి
  8. ఇది చల్లారాక మిక్సీ లో వేసి గ్రేవీ కోసం పేస్ట్ చేసుకోవాలి
  9. ఇప్పుడు పాన్ లో మిగిలిన నూనె వేసి వేడి అయ్యాక అందులో షాహిజీరా వేసి వేగాక 1కప్ ఉల్లిపాయ ముక్కలు,పసుపు వేసి వేపాలి
  10. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు,కారం పొడి, గరంమసాలా వేసి ఫ్రై చేయాలి
  11. ఇందులో గ్రేవీ పేస్ట్, కోఫ్తా ముక్కలు వేసి వేపాలి
  12. ఇప్పుడు తగినంత నీళ్లు వేసి కొంచెం సేపు కోఫ్తాలను అందులో ఉడికించాలి
  13. ఇప్పుడు కసూరీమేథీ కొంచెం డ్రై గా ఫ్రై చేసి చేతిలో నలిపి పొడిగా వేసుకోవాలి
  14. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  15. అంతే రుచికరమైన మేథీ జైపూరీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర